Wednesday, January 22, 2025
Homeఆంధ్రప్రదేశ్Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు

Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు

ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Kakani Govardhan Reddy)పై పోలీస్ కేసు నమోదైంది. ఇటీవల టీడీపీ, వైసీపీ నేతల మధ్య బోగోలు మండలం కోళ్లదీన్నేలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైసీపీ కార్యకర్తలను పరామర్శించడానికి ఆసుపత్రికి వచ్చిన గోవర్థన్ రెడ్డి.. పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు.

- Advertisement -

కొద్దిరోజుల్లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని.. ఈ పోలీసు అధికారులు ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి బట్టలూడదీస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే టీడీపీ నేతలు, కార్యకర్తలను ఎవ్వరిని వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత వంటేరు ప్రసన్న కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 224, 351/2, 352, 353/2 సెక్షన్ల కింద కాకాణిపై కేసులు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News