వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్(Duvvada Srinivas)కు మరో షాక్ తగిలింది. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను ఉద్దేశించి గతంలో దువ్వాడ శ్రీనివాస్ చెప్పు చూపిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో టెక్కలి నియోజకవర్గం అక్కవరం గ్రామంలోని ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు 41ఏ నోటీసులు అందజేశారు. విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే ఈ నోటీసులపై దువ్వాడ తీవ్రంగా స్పందించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనను, దివ్వెల మాధురి(Divvela Madhuri)ని టార్గెట్ చేశారని తెలిపారు. ఫోన్ కాల్స్ చేసి బెదిరించారని చెప్పారు. ఈ బెదిరింపులపై పోలీసులుకు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు.