మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి(Kakani Govardhan Reddy) పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని మైన్స్‌లో అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజం తవ్వుకున్నారనే కేసులో కాకాణిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు కాకాణి నివాసానికి వెళ్లారు. అయితే ఇంటికి తాళాలు వేసి ఉండటంతో ఇంటి ప్రధాన గేటుకు నోటీసులు అంటించారు.
సోమవారం ఉదయం 11గంటలకు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాకాణి ఇవాళ విచారణకు హాజరుకాకపోవడంతో నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ వెళ్లారు. ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 11గంటలకు విచారణకు రావాలని ఆదేశించారు. కాగా ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ముగ్గురురిని అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్ కోసం కాకాణి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ మంగళవారం జరగనుంది.