ఢిల్లీ సీఎం(Delhi CM) ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం జనసైనికులకు ఫుల్ జోష్ ఇస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ(PM Modi) వేదిక మీద ఉన్న నేతలకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan kalyan)ను చూసి ఆగారు. పవన్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబుతో చేయి కలిపి ముందుకు సాగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనసైనికులు ఇది పవన్ కళ్యాణ్ రేంజ్ అంటూ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.
కాగా అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్‌ను మోదీ పొగిడిన సంగతి తెలిసిందే. ఎన్టీయే ముఖ్య నేతల సమావేశంలో మోదీ మాట్లాడుతూ పవన్‌ను తుఫాన్ అంటూ అభివర్ణించారు. దీనిని బట్టి పవన్ కళ్యాణ్‌కు ప్రధాని ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతోందని రాజకీయ విశ్లేకులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బలపడేందుకు జనసేనానిని తమ అస్త్రంగా ఉపయోగించుకుంటారని చెబుతున్నారు.