Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్CID Custody: ముగిసిన పీఎస్ఆర్ ఆంజనేయులు సీఐడీ కస్టడీ విచారణ

CID Custody: ముగిసిన పీఎస్ఆర్ ఆంజనేయులు సీఐడీ కస్టడీ విచారణ

ముంబై నటి కాదంబరి జెత్వానీ, ఆమె కుటుంబ సభ్యులను వేధించిన కేసులో ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు(PSR anjaneyulu) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం రాబట్టడం కోసం సీఐడీ అధికారులు ఆయనను కస్టడీకి తీసుకున్నారు. తాడిగడప సీఐడీ కార్యాయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయనను విచారించారు. ఈ విచారణలో ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం ఆంజనేయులను విజయవాడ సబ్‌ జైలుకు తరలించారు. మరింత సమాచారం రాబట్టడం కోసం మరోసారి కస్టడీకి కోర్టులో పిటిషన్ వేయనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad