Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Gudiwada : కొడాలి నాని కి రావి వెంకటేశ్వరరావు సవాల్

Gudiwada : కొడాలి నాని కి రావి వెంకటేశ్వరరావు సవాల్

టీడీపీ నేత, గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వైసీపీ నేత, ప్రస్తుత గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న కొడాలి నాని.. తనపై చంద్రబాబు, లోకేష్ పోటీ చేసినా మళ్లీ తానే గెలుస్తానని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వ్యాఖ్యలపై రావి స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొడాలి నానికి సవాల్ విసిరారు. కొడాలిపై పోటీకి తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రావాల్సిన అవసరంలేదని, తనపై పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్ చేశారు.

- Advertisement -

కొడాలి నానికి కిడ్నీతో పాటు బ్రెయిన్ సర్జరీ కూడా జరిగినట్లుందని రావి ఎద్దేవా చేశారు. క్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ కు ఇదే చివరి చాన్స్ అని అన్నారు. అవినీతి, అక్రమాలతో సంపాదించిన సొమ్మును విచ్చలవిడిగా విరజిమ్మినా 2024లో కొడాలి నాని గెలవలేడని రావి వెంకటేశ్వరరావు ధీమాగా చెప్పారు.

కాగా.. కొడాలి నాని కి అంగబలంతో పాటు.. ధనబలం గట్టిగానే ఉంది. కొడాలి నాని సంగతి పక్కన పెడితే.. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులు, తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుకి ధన బలం తక్కువే అయినా.. ఆయన చేసే ప్రజా సేవా కార్యక్రమాలు మంచి పేరు తీసుకొచ్చాయి. మరి ఈ ఇద్దరూ గుడివాడ బరిలోకి దిగితే.. గట్టిపోటీనే ఉంటుందనడంలో సందేహం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad