Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Shilpa: జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణి

Shilpa: జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణి

భుత్వ బడుల రూపు రేఖలు మార్చడమే కాకుండా పిల్లలు బాగా చదవాలంటే వారికి పౌష్టిక ఆహారం కూడా అవసరం

చాపిరేవుల గ్రామం మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల లో ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి, సర్పంచ్, ఎంపిపి, ఎంఈఓ, ప్రధానోపాధ్యాయురాలుతో కలిసి విద్యార్థి విద్యార్థినులకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. జగనన్న నాడు-నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపు రేఖలు మార్చడమే కాకుండా పిల్లలు బాగా చదవాలంటే వారికి పౌష్టిక ఆహారం కూడా అవసరమని అందుకోసం బడులలో మధ్యాహ్నం భోజనం మెనూ కూడా మార్చామన్నారు.

- Advertisement -

ప్రతి పేద విద్యార్థికి అండగా ఉంటూ ప్రతి విద్యార్థికి యూనిఫామ్,బూట్లు, పుస్తకాలు, బ్యాగులు ఉచితంగా ఇస్తున్నామని, పేదవారు ఎవరూ చదువుకు దూరం కాకూడదు అనే ఉద్దేశ్యంతో అమ్మబడి ప్రవేశపెట్టి పేదల పిల్లల రూపురేఖలు మారుస్తున్నారు మన జగనన్న ప్రతి విద్యార్థి ఇంగ్లీషులో మాట్లాడాలి అని ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశ పెట్టారని ఎమ్మెల్యే శిల్ప తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad