Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: విరామ దర్శనం వేళలో మార్పులు

Srisailam: విరామ దర్శనం వేళలో మార్పులు

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధనంజయ వై. చంద్రచూడ్ ఈ నెల 25, 26వ తేదీలలో శ్రీ స్వామివార్ల దర్శనార్ధమై శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారి పర్యటనను పురస్కరించుకుని 26వ తేదీ ( ఆదివారం) ఉదయం వేళలో విఐపి బ్రేక్ దర్శనాలు, శ్రీస్వామివారి స్పర్శ దర్శన టికెట్లు( రూ. 500/-లు రుసుము) నిలుపుదల చేశారు. ఆ రోజు ఉదయం జరిగే 6.30గంటలకు సామూహిక అభిషేకాలు కూడా నిలుపుదల చేశారు.
ఆదివారం రోజున మధ్యాహ్నవేళలో అనగా 11.45 గంటలకు విఐపి బ్రేక్ దర్శనాలు, 12.30 గంటలకు స్పర్శ దర్శనాలు (రూ. 500/-లు రుసుము) కల్పిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు సామూహిక అభిషేకాలు కూడా యథావిధిగానిర్వహిస్తారు. భక్తులు ఈ మార్పునుగమనించవలసినదిగా శ్రీశైలం దేవస్థానం తెలియజేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News