Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Subbareddy: బాబుకు అండగా ఉందాం

Subbareddy: బాబుకు అండగా ఉందాం

బాబుతో నేనులో సుబ్బారెడ్డి

పట్టణంలో 23వ వార్డు నందు డోన్ పట్టణ టిడిపి అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డోన్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి, డోన్ నియోజకవర్గ టిడిపి అబ్జర్వర్ కమతం కాటమయ్య, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వలసల రామకృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సుబ్బారెడ్డి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను ప్రజలకు అందజేశారు. “రచ్చబండలో” ప్రజలతో మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు వైసిపి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు, దుర్మార్గ పాలనను సభలలో, రోడ్ షోలలో ఎండగడుతున్నాడే ఉద్దేశ్యంతో ఈ అక్రమ అరెస్ట్ లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మనం వచ్చే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు కి గెలిపించుకుంటే భవిష్యత్తుకు గ్యారంటీ పథకాలలోని సుపర్ సిక్స్ పథకాలే కాకుండా మరిన్ని మంచి పథకాలు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కాబట్టి ఇటువంటి కష్ట పరిస్థితులలో మనమంతా చంద్రబాబు కి అండగా ఉండి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News