క్వార్ట్జ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డికి (Kakani Govardhan Reddy) సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం అభియోగాలపై పొదలకూరు పోలీసుస్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది.
- Advertisement -
కాగా ఈ కేసు నమోదైన నాటి నుంచి కాకాణి అజ్ఞాతంలో ఉన్నారు. విచారణకు హాజరు కావాలని మూడుసార్లు నోటీసులిచ్చినా ఆయన హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో కాకాణి అరెస్టుకు మార్గం సుగమం అయింది.