Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Bhaskar Reddy: వివేకా హత్య కేసు.. వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

YS Bhaskar Reddy: వివేకా హత్య కేసు.. వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

YS Bhaskar Reddy| మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు(Viveka Murder case)లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.

- Advertisement -

కాగా భాస్కర్‌ రెడ్డికి ఇటీవల తెలంగాణ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు బెయిల్ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సీబీఐ సవాల్‌ చేసింది. తొలుత బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయమూర్తి.. మళ్లీ బెయిల్‌ మంజూరు చేశారని పిటిషన్‌లో పేర్కొంది.

మరోవైపు వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాదులు స్పందిస్తూ ఈ కేసులో మిగతా నిందితుల బెయిల్‌ రద్దు పిటిషన్లూ దాఖలయ్యాయని తెలపారు. వీటితో భాస్కర్ ‌రెడ్డికి సంబంధించిన పిటిషన్‌ కూడా జత చేయాలని కోరారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం మిగిలిన నిందితుల పిటిషన్లతో పాటు ఆయన బెయిల్‌ రద్దు పిటిషన్‌ను జత చేయాలని ఆదేశించింది. అన్ని పిటిషన్లను ఒకేసారి విచారణ చేస్తామని స్పష్టం చేసింది. కాగా వైఎస్ భాస్కర్ రెడ్డి కపడ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad