Thursday, April 3, 2025
Homeఆంధ్రప్రదేశ్Paritala Sunitha : ఆ నేత కోసం పరిటాల సునీత ఆందోళన.. పోలీస్ స్టేషన్ వద్ద...

Paritala Sunitha : ఆ నేత కోసం పరిటాల సునీత ఆందోళన.. పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

అక్రమంగా అరెస్ట్ చేసిన టీడీపీ నేత జగ్గును విడుదల చేయాలంటూ మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పరిటాల సునీతకు మద్దతుగా భారీగా టీడీపీ శ్రేణులు తరలిరావడంతో పరిస్థితి ఉద్రిక్తమయింది. వివరాల్లోకి వెళ్తే.. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి పరిటాల కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. పరిటాల కుటుంబాన్ని భూస్థాపితం చేస్తామని, టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ లను చంపేస్తామని హెచ్చరించారు. చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలకు బత్తలపల్లి టీడీపీ నేత జగ్గు కౌంటర్ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో శనివారం రాత్రి పోలీసులు జగ్గుని అరెస్ట్ చేసి.. స్టేషన్ కు తీసుకెళ్లారు. జగ్గు కోసం కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన టీడీపీ నాయకులపై వైసీపీ నేతలు దాడికి దిగారని పరిటాల సునీత ఆరోపించారు. వైసీపీ నేతలకు సహకరించిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జగ్గుని అక్రమంగా అరెస్ట్ చేశారని, అతడిని విడుదల చేసేంతవరకూ ఆందోళన విరమించేది లేదని పోలీసులకు తేల్చిచెప్పారు. చంద్రబాబు, లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రశేఖర్ రెడ్డిపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News