పత్తికొండలో దౌర్జన్యంగా కడగొమ్ము వంక పోరం పోగు కబ్జాపై ‘తెలుగు ప్రభ’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ఎట్టకేలకు అధికారుల్లో చలనం వచ్చింది. గురువారం రాత్రి తహశిల్దార్ విష్ణు ప్రసాద్ సర్వేనెంబర్ 95 భూమినీ ఆక్రమించి బండలు నాటిన నిర్మాణాలను దగ్గరుండి జెసిబితో తొలగించారు. 95 సర్వే నెంబర్ లో ఉన్న కడగమ్ము వంకను ఆనుకుని ఇంటి నిర్మాణాలు కట్టడాలు చేపడితే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని,వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని మరొకసారి హెచ్చరిచారు. రెవెన్యూ అధికారులకి సమాచారం ఇవ్వకుండా ఎలాంటి అనుమతులు లేకుండా ఇలాంటివి జరగకూడదు అని రెవెన్యూ సిబ్బంది హెచ్చరించింది. అయినా అనుమతి లేకుండా కట్టడాలు జరిగితే ఎవరి ప్రమేయం లేకుండా కూల్చివేస్తామని అన్నారు. పత్తికొండ చెరువు కడగమ్ము నుంచి ప్రవహించే నీటికి అడ్డంగా అక్రమ కట్టడాలు నిర్మిస్తే భవిష్యత్తులో నాయి బ్రాహ్మణ కాలనీకి, ఆదినారాయణ రెడ్డి కాలనీకి, తీవ్ర ఇబ్బంది కలుగుతుందని అన్నారు. వంక పోరంబోగు స్థలాలలో ఎవరికి పట్టాలు మంజూరు కావని, ఎవ్వరు ఇవ్వలేరని తేల్చి చెప్పారు. రెవెన్యూ అధికారులకు తెలియకుండా ఎవరైనా కట్టడాలు నిర్మిస్తే ముందస్తు సమాచారం లేకుండా కులగోడతామని తాహాశిల్దార్ విష్ణు ప్రసాద్ తెలిపారు.
ఫోటో రైట్ అప్.1.