Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Teluguprabha effect: తెలుగుప్రభ ఎఫెక్ట్, ఎట్టకేలకు కర్నూలు కలెక్టరేట్ గేట్ వద్ద మరమ్మతులు

Teluguprabha effect: తెలుగుప్రభ ఎఫెక్ట్, ఎట్టకేలకు కర్నూలు కలెక్టరేట్ గేట్ వద్ద మరమ్మతులు

ఇలా నామమాత్రంగా కాకుండా పూర్తిగా రిపేర్ చేయాలని డిమాండ్

ఈనెల ఒకటో తేదిన ఆదివారం తెలుగు ప్రభ పత్రికలో ప్రచురితమైన కథనంలో జిల్లా ప్రధాన ప్రభుత్వ కార్యాలయ గేటు దాటాలంటే అష్ట కష్టాలు పడాల్సిందే అన్న వార్తకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ యంత్రాంగం స్పందించి అధికారులు మారమ్మతులు చేపట్టారు. కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రధాన ముఖద్వారం ముందు డ్రైనేజీపై కప్పి ఉంచిన ఇనుప ర్యాంపు పైపులు దెబ్బతినడంతో ప్రతినిత్యం ప్రమాదాలు జరిగేవి. ఈ ప్రమాదంలో ర్యాంపుపై నడిచి కాళ్లు ఇరుక్కుపోయి, కాలువలో పడి కాళ్లు విరగొట్టుకున్న సంఘటనలు కూడా జరిగాయి. ఈ వార్తకు స్పందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన ర్యాంపుకు ఉన్న ఇనుప పైపులు వెల్డింగ్ చేయించి మరమ్మతులు చేయించారు.

- Advertisement -

పనులు అయితే చేయించారు కానీ పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేపట్టలేదు. కలెక్టర్ కార్యాలయానికి ప్రవేశించే ద్వారంలో వెల్డింగ్ పూర్తిస్థాయిలో చేయించారు కానీ కలెక్టర్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లే దారిలో కొంత భాగం ర్యాంపు పైపులు భారీ వాహనాలు తిరిగి వంపునకు గురయ్యాయి. వాటిని పూర్తిస్థాయిలో మరమ్మతు చేపట్టకుండా అరకొరగా వెల్డింగ్ చేయించారు. ఏదైనా భారీ వాహనం ఆ ప్రదేశంలో వెళితే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల లోడుతో భారీ వాహనాలు కలెక్టర్ కార్యాలయానికి నిత్యం వస్తున్నాయి. ఈ వాహనాలు గనుక అటువైపు నుంచి వెళితే ప్రమాదం జరిగటం ఖాయం. అలాగే వృద్ధులు, వికలాంగులు, పాఠశాల విద్యార్థులు అటువైపు వెళితే ప్రమాదం సంభవించే అవకాశాలు లేకపోలేదు. కావున అటువైపు కూడా నామమాత్రంగా కాకుండా పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కు కలెక్టర్ కార్యాలయానికి వచ్చే సందర్శకులు, వృద్ధులు, మహిళలు, పాఠశాలకు వెళ్లే విద్యార్థిని, విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News