Saturday, September 28, 2024
Homeఆంధ్రప్రదేశ్Teluguprabha: శ్రీమఠంలో తెలుగుప్రభ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

Teluguprabha: శ్రీమఠంలో తెలుగుప్రభ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

శ్రీమఠంలో తెలుగుప్రభ దినపత్రిక డైరీ, క్యాలెండర్ ను పీఠాధిపతులు శ్రీసుభుధేంద్రతీర్థులు ఆవిష్కరించారు. తెలుగుప్రభ దినపత్రిక ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలంటూ, దినదినాభివృద్ధి చెందాలని పీఠాధిపతి ఆకాంక్షించారు. దారి తప్పుతున్న సమాజాన్ని సన్మార్గంలో నడిపే దిశగా అడుగులు వేయాలని సూచించారు. అటు ప్రభుత్వాలకు ఇటు సమాజానికి మార్గదర్శిగా తెలుగుప్రభ దినపత్రిక అంచెలంచెలుగా ఎదిగి పాఠకుల మన్ననలు చూరగొంటూ.. అడుగులు ముందుకు వేయాలని పీఠాధిపతులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మఠం అధికారులు, ద్వారపాలకులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News