రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్తు, పావలా వడ్డీ రుణాలు వంటి సంక్షేమ పథకాలతో వైఎస్‌ఆర్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానేత దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఎమ్మెల్యే తోగుర్ అర్థర్ కొనియాడారు. దివంగత నేత మాజీ సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 74 వ జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే తోగూర్ అర్థర్ నందికొట్కూరు నియోజకవర్గంలో బ్రాహ్మణ కొట్టుకూరు నుండి మొదలుకొని, నందికొట్కూరు, పాములపాడు, ఆత్మకూరు పరిధిలోని నల్లకల్వ ప్రాంతంలో వైయస్సార్ స్మృతి వనములో డాక్టర్ వైయస్సార్ విగ్రహము ప్రతి విగ్రహానికి తన అనుచర వైసిపి నాయకులతో పూలమాలలు, క్షీరాభిషేకం చేస్తూ ఘనంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా ఎమ్మెల్యే అర్థర్, మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ, వైసిపి రాష్ట్ర నాయకులు చెరుకుచర్ల రఘురామయ్య, కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్, ధర్మారెడ్డి, సింగిల్ విండో చైర్మన్స్ సగినేలా హుస్సేనయ్య, హరి సర్వోత్తమ రెడ్డి, వివిధ మండలాలు నేతలతో కలిసి ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు బెడ్స్ పంపిణీ చేపట్టారు. అనంతరం పార్టీ కార్యాలయంలో వైయస్ విగ్రహానికి పాలభిషేకం చేస్తూ ఎమ్మెల్యే తన అనుచరులతో భారీ కేక్ కట్ చేసి వైయస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అర్థర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో ప్రజలకు మెరుగైన పాలన అందించిన నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. నాడు బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు వైద్య సదుపాయం అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రతి ప్రాణం విలువైనది అంటూ పేద ప్రజల పెన్నిధిగా రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108,104, అంబులెన్సులు పెట్టి ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించిన ఘనత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డికి దక్కుతుందన్నారు. అలాంటి మహనీయుని కుమారుడు సీఎం జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ఆశలను ముందుకు తీసుకెళ్తూ నవరత్న పథకాల పేరుతో ప్రజా రంజకమైన పాలన కొనసాగిస్తున్నారన్నారు. రైతు బాంధవుడుగా రైతన్నల సంక్షేమము కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి ఆయన జన్మదినాన్ని రైతుల దినోత్సవంగా రాష్ట్రములో జరుపుకుంటున్నామన్నారు. జనరంజకమైన పాలన కొనసాగించి ప్రజల గుండెల్లో చిరస్మనీయుడుగా నిలిచిన నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయనను నేడు ప్రజలు మరువలేదని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే సీఎం జగనన్న ధ్యేయమన్నారు.
సీఎం జగనన్న నాయకత్వంలో పార్టీ అభివృద్ధి కోసం, వైయస్సార్ ఆశయాల కోసం అహర్నిశలు కార్యకర్తలారా ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ రమాదేవి, వైసిపి మహిళా అధ్యక్షురాలు డాక్టర్ వనజ, ఎస్సీ సెల్ నంద్యాల జిల్లా అధ్యక్షులు వెంకటరమణ, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ సభ్యులు దిలీప్, వైఎస్ఆర్సిపి నాయకులు పేరుమళ్ళా జాన్,ఆర్ట్ శ్రీను, ఉదయ్ కుమార్ రెడ్డి, రఘు రెడ్డి, శ్రీనివాసరెడ్డి, భాస్కర్ రెడ్డి, కొణిదల సర్పంచ్ నవీన్, పాపకోట వెంకటరెడ్డి, దామగట్ల రత్నం,శాతన కోట వెంకటేశ్వర్లు,పైపాలెం ఈనాయాతుల్లా, బిజినవేముల మహేష్ వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.