తిరుపతి(Tirupati)లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వైకుంఠ ఏకాదశి మొదలయ్యే సమయంలోనే ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఘటనకు కారణంపై విచారణ జరుగుతుందని.. విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు.
- Advertisement -
తిరుపతి రుయా ఆస్పత్రిలో మృతుల కుటుంబ సభ్యులను మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, పార్థసారథి, ఆనం రామనారాయణరెడ్డి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరామర్శించారు. అనంతరం స్విమ్స్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.