కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. శనివారం రాత్రి 9.10 గంటలకు ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు(CM Chandrababu) నివాసానికి రానున్నారు. డిన్నర్ అనంతరం రాత్రికి విజయవాడ నోవాటెల్ హోటల్‌లో బస చేస్తారు.
- Advertisement -
ఆదివారం గన్నవరం నియోజకవర్గం కొండపావులూరులో జరిగే NDRF 20వ వ్యవస్ధాపక దినోత్సవ వేడుకలకు హాజరు కానున్నారు. ఇందులో భాగంగా NIDM క్యాంపస్ ప్రారంభించనున్నారు. దాదాపు రెండు గంటలపాటు జరగనుంది ఈ సమావేశం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశం అనంతరం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి కేంద్ర అమిత్ షా తిరుగు పయనమవుతారు.