Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Kumaraswamy: విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగదు: కుమారస్వామి

Kumaraswamy: విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగదు: కుమారస్వామి

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌(Vizag Steel Plant)ను ప్రైవేటీకరణ చేయబోమని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి(Kumaraswamy) మరోసారి స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిన ఆయన కార్మిక సంఘాల ప్రతినిధులు, అధికారులతో భేటీ అయ్యారు. అనంతరం స్థానిక ఎంపీ భరత్, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, ఇతర నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం విశాఖ ప్లాంట్‌కు రూ.35వేల కోట్లు అప్పులు ఉన్నాయని వివరించారు. తొలి దశలో NPA నుంచి బయట పడేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి రూ.11వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేశారని తెలిపారు. ఈ నిధులు సమర్థవంతగా వినియోగించడంపై రోడ్ మ్యాప్ సిద్ధంచేస్తున్నామని.. ఇందులో భాగంగానే ప్లాంట్ విజిట్ చేశానని పేర్కొన్నారు.

- Advertisement -

ప్రస్తుతం స్టీల్ ప్లాంటు సమర్ధవంతంగా పనిచేస్తోందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ సాధనకు సుమారు 30 మంది మరణించారని.. పరిశ్రమ ప్రారంభంలో ఉత్పత్తి బాగా ఉండేదని గుర్తు చేశారు. అయితే 2014లో నవరత్న హోదా రావడంతో ఉక్కు ఉత్పత్తి పెంచాలని లక్ష్యంతో నష్టాల్లోకి వెళ్లిందన్నారు. కార్మికులకు ఉన్న ఇబ్బందులు తెలుసని.. వారి సమస్యలను మూడు నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 15 రోజుల్లో వర్కింగ్ ప్లాన్ ప్రకటిస్తాం అని ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad