Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: ఫోన్ ట్యాపింగ్‌తో కేసీఆర్, జగన్ నీచ రాజకీయాలు చేశారు: షర్మిల

YS Sharmila: ఫోన్ ట్యాపింగ్‌తో కేసీఆర్, జగన్ నీచ రాజకీయాలు చేశారు: షర్మిల

YS Sharmila: తెలుగు రాష్ట్రాలో ఫోన్ ట్యాపింగ్ అంశం పెను దుమారం రేపుతోంది. ఇప్పటివరకు తెలంగాణకే పరిమితమైన ఈ అంశం తాజాగా ఏపీ రాజకీయాల్లోనూ ప్రకంపనలు రేపుతోంది. ఏపీకి చెందిన కీలక నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు వార్తలు వస్తున్నారు. అందులో మాజీ సీఎం జగన్ సోదరి, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పేరు కూడా ఉంది. ఈ ఆరోపణలపై షర్మిల స్పందించిన సంగతి తెలిసిందే. తన ఫోన్ ట్యాప్ చేశారని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్-జగన్ రాజకీయ బంధం ముందు రక్తసంబంధం చిన్నబోయిందని వాపోయారు. తన ఫోన్ ట్యాప్ అయినట్లు వైవీ సుబ్బారెడ్డి ఆడియో టేప్ కూడా వినిపించారని తెలిపారు. అయితే షర్మిల వ్యాఖ్యలను వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. ఆమె అసత్యాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

తాజాగా వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంట్లోనే వైవీ వినిపించిన ఆడియో విన్నానని స్పష్టం చేశారు. బైబిల్ మీద, తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతానని స్పష్టం చేశారు. ట్యాపింగ్ తమకు ఏం అవసరమని ఇప్పుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. తాను రాజకీయంగా ఎదగకూడదని తనపై నిఘా పెట్టారన్నారు. తనకు సపోర్ట్ ఇవ్వకుండా పెద్ద పెద్ద నాయకులను భయపెట్టారని చెప్పారు. సుబ్బారెడ్డి చేతిలో ఎందుకు ఆడియో ఉందనే దానిపై ఆయన సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సుబ్బారెడ్డి తన కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేసి చెప్పాలన్నారు. అప్పట్లో ఆయనతో సన్నిహిత్ సంబంధాలు ఉండేవని.. ఆస్తుల విషయం దగ్గరి నుంచి సుబ్బారెడ్ది తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. జగన్ స్క్రిప్ట్ ప్రకారం అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.

కేసీఆర్, జగన్ అప్పట్లో ఫోన్ ట్యాప్ చేస్తూ చిల్లర రాజకీయాలు చేశారని ఫైర్ అయ్యారు. మొన్న జరిగిన ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయి కాబట్టే ఫోన్ ట్యాపింగ్ అంశం బయటకు వచ్చిందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం తనకు లేదన్నారు. జగన్ తీరు అలీబాబా 40 దొంగల తీరు లెక్క ఉందని విమర్శించారు. దొంగలు ఎక్కడైనా దొంగతనం చేశామని ఒప్పుకుంటారా ? అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుబ్బారెడ్డిని తెలంగాణ ప్రభుత్వం విచారించాలని ఆమె డిమాండ్ చేశారు. వందలాది మంది ఫోన్లు ట్యాప్‌ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని షర్మిల కోరారు. కాగా షర్మిల ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం తనకు ఎందుకు ఉంటుందని జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad