YS Jagan: వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం దిగజారిపోయిందని ఆరోపించారు. పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, వైయస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లలోకి అనుమతించలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. 15 బూత్‌లలో ఒక్క ఏజెంట్‌నూ అనుమతించకుండా, పోలీసుల సహకారంతో టీడీపీ ఓట్ల రిగ్గింగ్‌కు పాల్పడిందని ఆరోపించారు. ఫామ్-12లను లాక్కొని చింపేశారని, ఓటర్లను బెదిరించారని జగన్ వెల్లడించారు.
ALSO READ: https://teluguprabha.net/news/ap-election-controversy-jagan/
చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, బూత్‌లను ఆక్రమించి దొంగ ఓట్లు వేయించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ సెంటర్లను మార్చి, ఓటర్లను 4 కి.మీ. నడిచి ఓటు వేయమని ఒత్తిడి చేశారని, ఇది ఓటింగ్‌ను అడ్డుకునే కుట్రగా జగన్ అభివర్ణించారు. డీఐజీ కోయ ప్రవీణ్ నేతృత్వంలో పోలీసులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని, మహిళలపై సైతం దాడులు జరిగాయని ఆరోపించారు.
జగన్ సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. “మీకు పరిపాలనపై నమ్మకం ఉంటే, కేంద్ర బలగాల సమక్షంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించండి. వెబ్ కాస్టింగ్, సీసీ ఫుటేజ్ బహిర్గతం చేయండి,” అని డిమాండ్ చేశారు. టీడీపీ లక్ష్యం ప్రజలకు మంచి చేయడం కాదు, దోచుకోవడమేనని విమర్శించారు. ఈ ఎన్నికలను రద్దు చేసి, న్యాయపోరాటం చేస్తామని, కోర్టులో పిటిషన్ వేస్తామని జగన్ ప్రకటించారు.


