ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఆల్ ఇండియా యూకో బ్యాంక్ దివ్యాంగజన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం తరపున ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా సంఘం తరపున శుభాకాంక్షలు తెలిపారు.
వికలాంగులు కూడా సమాజంలో పూర్తి స్థాయి పౌరులుగా గుర్తించబడాలని కోరుకుంటున్నాము. వారికీ సమాన అవకాశాలు, సమాన హక్కులు కల్పించాలని కోరుకుంటున్నామని, వికలాంగుల హక్కులను పరిరక్షించడానికి, వారికి సమాన అవకాశాలు కల్పించడానికి ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు.
ప్రజలందరినీ వికలాంగుల హక్కులను పరిరక్షించడంలో చేయూతనివ్వాలని కోరుతున్నామన్నారు. వికలాంగులకు సానుకూల వాతావరణాన్ని సృష్టించడంలో ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిష్కారాలు వారు సూచించారు.
శారీరక అవరోధాలను తొలగించడానికి ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేయడం దివ్యాంగులకు ఆర్థిక సహాయం, ఉద్యోగ అవకాశాలను కల్పించడం సామాజిక అవగాహనను పెంచడానికి అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.