Sunday, November 16, 2025
HomeAP జిల్లా వార్తలుTirumala laddu: శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు నూతన కవర్లు

Tirumala laddu: శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు నూతన కవర్లు

తిరుమలలో లడ్డూ ప్రసాద కేంద్రంలో పర్యావరణహిత లడ్డూ కవర్లను(cover) తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుబాటులో ఉంచారు. గతంలో ఓ ప్రైవేటు సంస్థ కవర్ల విక్రయాన్ని చేపట్టి టీటీడీకి అద్దె చెల్లించకుండా భారీగా లాభాలు ఆర్జించింది.

కూటమి ప్రభుత్వం వీటిని గుర్తించి సదరు సంస్థ అనుమతులు రద్దు చేశారు. ప్రస్తుతం తితిదే ఆధ్వర్యంలో పర్యావరణహిత లడ్డూ కవర్ ఒకటి రూ.5కు, జనపనార బ్యాగ్ రూ.10కు అందుబాటు లోకి తీసుకువచ్చారు.

ఇక తిరుమలకు వచ్చే భక్తులు ప్రత్యేకంగా కవర్స్, బ్యాగ్స్ క్యారీ చేయాల్సినసరం లేకుండా పోయింది. హ్యపీగా లడ్డు కౌంటర్స్ కి వెళ్లి కవర్ తో కూడిన లడ్డులను కొనుగోలు చేసుకోని ఇంటికి తీసుకుపోవచ్చు. దీంతో పర్యావరణానికి కూడా చాలా మేలు చేసినట్టుందని పలువురు భక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఈ లడ్డు కవర్లు కూడా పర్యావరణ హితంగా ఉండటంతో భక్తులు కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad