Monday, November 17, 2025
HomeAP జిల్లా వార్తలుTirumala:శ్రీవారి సేవలో ప్రముఖ సింగర్ సునీత

Tirumala:శ్రీవారి సేవలో ప్రముఖ సింగర్ సునీత

- Advertisement -

తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ గాయని( singer sunitha) సునీత దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

పండితుల వేదశీర్వచనం
దర్శన అనంతరం రంగనాయకుల మండలంలో పండితులు వేదశీర్వచనం అందించారు. ఆలయం అధికారులు శాలువతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల సునీత మీడియాతో మాట్లాడారు.

వెంకన్న దర్శనం చాలా సంతోషం
ఈ నూతన యేడాది స్వామి వారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఆ వెంకన్న దీవెనల కోసం తిరుమలకు వచ్చానని సింగర్ సునీత అన్నారు. స్వామి వారి దర్శన అనంతరం తన్మయత్వం చెంది మాటలు రావడం లేదని మీడియా ముఖంగా తెలిపారు. స్వామి వారి వైభవాన్ని పాట రూపంలో కొనియాడారు.

భక్తుల సంబరం
సింగర్ సునీత రాకతో భక్తులు చాలా సంబరపడిపోయారు. ఆమెతో సెల్పీలు తీసుకునేందుకు ఉత్సాహ పడ్డారు. పలు సినిమాల్లో తన తియ్యనైనా గాత్రంతో అందరిని సింగర్ సునీత మైమరిపింపచేస్తుంది. ఈ సింగర్ పాటలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad