Monday, November 17, 2025
HomeAP జిల్లా వార్తలువిశాఖపట్నం మున్సిపల్ పాలనలో మార్పు.. డిప్యూటీ మేయర్ అవిశ్వాసం..!

విశాఖపట్నం మున్సిపల్ పాలనలో మార్పు.. డిప్యూటీ మేయర్ అవిశ్వాసం..!

విశాఖపట్నం నగరంలో మున్సిపల్ పాలనలో మరో సారి పెనుమార్పు చోటు చేసుకుంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌పై అవిశ్వాస తీర్మానం విజయవంతమైంది. ఏప్రిల్ 26, 2025న నిర్వహించిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో 74 మంది కార్పొరేటర్లు శ్రీధర్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఈ తీర్మానం పైచేయి సాధించింది.

- Advertisement -

సమావేశానికి జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇన్‌చార్జ్ కమిషనర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ నేతృత్వం వహించారు. సభ్యుల గుర్తింపునకు అధికారిక ఐడీ కార్డులు తప్పనిసరి చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి గందరగోళం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇంతకుముందు మేయర్ గోలగాని హరి వెంకట కుమారి మీద కూడా అవిశ్వాస తీర్మానం విజయవంతం కావడం తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు డిప్యూటీ మేయర్ పదవీ గాలిలోకెళ్లడం జీవీఎంసీలో రాజకీయ అస్థిరతను బహిర్గతం చేస్తోంది.

ప్రస్తుతం మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు రెండూ ఖాళీ కావడంతో, ఎన్నికల కమిషన్ త్వరలోనే కొత్త ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. నగర పాలనలో నూతన శకం మొదలవబోతోందన్న అంచనాలు కొనసాగుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad