Sunday, November 16, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss Written Updates: నేను నీకు ఓకేనా.. కళ్యాణ్ ప్రపోజల్.. చైల్డ్ అంటూ హార్ట్...

Bigg Boss Written Updates: నేను నీకు ఓకేనా.. కళ్యాణ్ ప్రపోజల్.. చైల్డ్ అంటూ హార్ట్ బ్రేక్ చేసిన తనూజ

Bigg Boss Written Updates: బిగ్‌బాస్ తెలుగు ఐదో వారంలో గేమ్ సీరియస్ గా మారిపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని బిగ్ బాస్ చెప్పినప్పట్నుంచి అందరూ ఆట మొదలెట్టారు. ఇక, లేటెస్ట్ ఎపిసోడ్‌లో మరో రెండు టాస్కులు జరిగాయి. మొత్తం 10 మందిని ఐదు జంటలుగా విడగొట్టి వివిధ రాకాల ఛాలెంజెస్ ఇస్తున్నాడు బిగ్‌బాస్. ఈరోజు జరిగిన టాస్కుల్లో భరణి-దివ్య, రీతూ-డీమాన్ జోడీలు దుమ్మురేపాయి. అయితే అంతకుముందు తనూజకి కళ్యాణ్ ప్రపోజ్ చేసి అందరికీ షాకిచ్చాడు. మరి దానికి తనూజ ఇచ్చిన ఆన్సర్ చూసి కళ్యాణ్ దిమ్మ తిరిగిపోయింది. అయితే, ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

బుద్ధి మార్చుకోని కాట్రాజ్ కళ్యాణ్

బిగ్‌బాస్ సీజన్-9లో యాక్టివ్‌గా ఉన్న లవ్ ట్రాక్‌లు అయితే రీతూ-డీమాన్‌లదే. అంతకుముందు ఇది కళ్యాణ్‌తో కలిసి ట్రయాంగిల్ ట్రాక్‌లా ఉండేది. కానీ నెమ్మదిగా కళ్యాణ్ సైడ్ అయిపోయాడు. అయితే పక్కకెళ్లి తనూజని కళ్యాణ్ ట్రై చేస్తున్నాడు. కానీ తనూజ నుంచి అంత రియాక్షన్ రావడం లేదు. కానీ లేటెస్ట్ ఎపిసోడ్‌లో మాత్రం కళ్యాణ్ ఓపెన్ అయిపోయాడు. డైరెక్ట్‌గా తనూజని అడిగాడు. దీనికి తనూజ ఇచ్చిన రిప్లయ్‌కి కళ్యాణ్‌కి బుర్ర తిరిగిపోయింది. ఈరోజు ఎపిసోడ్‌లో తనూజ గార్డెన్ ఏరియాలో వాకింగ్ చేస్తుంటే ఇమ్మూ పక్కకి వెళ్లి సరదాగా ఆటపట్టించాడు. అబ్బా ఏంటబ్బా ఇంత క్యూట్ ఉంది మన పెయిర్.. ఎంతమంది ముందుకొచ్చి అందాలు జల్లుతున్నా.. అంటూ ఏమాయ చేశావేలో పాట పాడాడు ఇమ్మూ. నేను నీ బ్రదర్‌గా ఉండాలనుకోవట్లేదు జెస్సీ.. అంటూ ఆ సినిమాలో డైలాగ్ కొట్టాడు. దీంతో నీ వయసెంత.. అని తనూజ అడిగింది. నీ కన్నా రెండు సంవత్సరాలు పెద్దే.. అంటూ ఇమ్మూ చెప్పాడు. ఫర్లేదు ఎవరైనా అడిగితే అన్నయ్య లాంటి వాడివని చెప్పేస్తాను.. అని తనూజ పంచ్ ఇచ్చింది. చెప్పెస్తే కొట్టేస్తాను.. చెప్పాల్సినోళ్లకి చెప్పెయ్ తమ్ముడని.. నాకెందుకు అంటూ కళ్యాణ్ వైపు చూసి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు ఇమ్మూ. ఈ మాటకి రీతూ, కళ్యాణ్, తనూజ నవ్వుకున్నారు.

Read Also: Bigg Boss Sudeepa: పెళ్లయిన పదేళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ.. ఆ బిగ్ బాస్ ఫేమ్ ఎవరో తెలుసా?

నేను నీకు ఓకేనా

కాసేపటికి తనూజకి కళ్యాణ్ ప్రపోజల్ పెట్టాడు. ఏదైనా అవకాశం ఉండి.. నా లాంటి వాడు అయితే నీకు ఓకేనా .. అని కళ్యాణ్ అడిగితే ఇందుకే నిన్ను చైల్డ్ అనేది.. అంటూ తనూజ నవ్వుకుంది. ఎక్స్‌క్యూజ్‌ మీ.. ఓకే నా ఏజ్‌కి ఇంతే మెచ్యూరిటీ ఉంది చెప్పు.. అని కళ్యాణ్ అన్నాడు. ఎలాంటి పరిస్థితినైనా కూల్‌గా, కామ్‌గా డీల్ చేసే పర్సన్.. ఒకరు 100 మాటలు మాట్లాడినా ఒకే మాటలో దాన్ని ఫసక్ చేసి.. ఆ టాపిక్‌ని ఎండ్ చేసే క్యాపబులిటీ.. అన్నింటినీ మించి నా మైండ్ సెట్‌కి ఇప్పుడు నీకు అన్నీ నేను ఎలా చెప్తున్నానో నాకు అలా చెప్పే పర్సన్ ఇష్టం.. అంటూ తనూజ చెప్పింది. అంటే నేను చెప్పలేనంటావ్.. అని కళ్యాణ్ కొశ్చన్ చేశాడు. చెప్పావా చెప్పలేదా అనేది మేటర్ కాదు నేను చెప్తున్నాను ఎలాగా అని.. అంటూ తనూజ ఆన్సర్ ఇచ్చింది. సరే.. అంటూ కళ్యాణ్ తలాడించాడు. దీంతో హర్ట్ అయ్యావా.. అని తనూజ అడిగితే బాగా.. అంటూ ఆన్సర్ ఇచ్చాడు కళ్యాణ్. ఇందుకే చెప్పాను.. దీనికోసమే చెప్పాను.. చూశావా.. చిన్నచిన్నవాటికే హర్ట్ అవుతావ్ అలా అవ్వకూడదు.. స్ట్రాంగ్‌గా ఉండాలి.. అంటూ తనూజ నవ్వింది. ఇక ఈ డిస్కషన్ అంతా ఎదురుగా ఉన్న మంచం మీద పడుకొని రీతూ, ఇమ్మూ, సంజన చూశారు. చైల్డ్ అని ఇమ్మూ అనగానే.. అదే అనిపిస్తుంది ఇందాక మధ్యాహ్నం నుంచి.. అదే అందామనుకున్నా మళ్లీ ఎందుకులే అని ఆపేశాను.. అని రీతూ అంది. ఆమె చిన్న పిల్లోడితో మాట్లాడినట్లు మాట్లాడుతుంది..అంటూ తనూజ-కళ్యాణ్ గురించి ఇమ్మూ చెప్పాడు.​

Read Also: Bigg Boss: నిలిచిపోయిన బిగ్ బాస్ షో.. బయటకు వచ్చేసిన కంటెస్టంట్లు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad