Sunday, November 16, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss Elimination: ప్రియా సేఫ్.. మర్యాద మనీష్ ఔట్.. షాకింగ్ గా సెకండ్ వీక్...

Bigg Boss Elimination: ప్రియా సేఫ్.. మర్యాద మనీష్ ఔట్.. షాకింగ్ గా సెకండ్ వీక్ ఎలిమినేషన్

Bigg Boss Elimination:  బిగ్ బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. రెండో వారంలోకి వచ్చేసరికి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటూ హోరాహోరీగా సాగుతోంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి మరొకరు ఎలిమినేట్ అవ్వాల్సిన టైమ్ దగ్గరపడింది. వీకెండ్ ఎపిసోడ్ కు రంగం సిద్ధమైంది. అయితే బిగ్ బాస్ 9 తెలుగు సెకండ్ వీక్ నామినేషన్లలో ఏడుగురు ఉండగా.. వీళ్లలో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారాన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. బిగ్ బాస్ 9 తెలుగు నామినేషన్స్ బిగ్ బాస్ 9 తెలుగు నామినేషన్లలో రెండో వారం ఏడుగురున్నారు. సుమన్ శెట్టి, భరణి, ఫ్లోరా సైని, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్, డీమాన్ పవన్ సెకండ్ వీక్ నామినేట్ అయ్యారు. ఇందులో సుమన్ శెట్టి, భరణి, ఫ్లోరా సైని సెలబ్రిటీలు. మిగతా నలుగురు కామనర్స్. ఈ సారి బిగ్ బాస్ 9 తెలుగు నుంచి ఎలిమినేట్ అయ్యేది వంద శాతం కామనర్స్ అని సమాచారం.

- Advertisement -

ఎవరు ఎలిమినేట్?

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ సెకండ్ వీక్ లో హౌస్ నుంచి ఓ కామనర్ ఎలిమినేట్ కానున్నారు. ఫస్ట్ వీక్ లో సెలబ్రిటీ శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. సెకండ్ వీక్ లో నామినేషన్లలో ఉన్న కామనర్స్ హరిత హరీష్, ప్రియా శెట్టి, మర్యాద మనీష్, డీమాన్ పవన్ లో నుంచి ఒకరు హౌస్ నుంచి వెళ్లిపోవాల్సిందే. ఓటింగ్ ప్రకారం కూడా లీస్ట్ లో కామనర్స్ మాత్రమే ఉండారు. బిగ్ బాస్ ఓటింగ్ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో సెకండ్ వీక్ ఓటింగ్ ఎలా ముగిసిందో ఓ సారి చూద్దాం. ఈ వారం కూడా జనాలు సెలబ్రిటీలకే ఎక్కువ ఓట్లు వేశారు. 42.39 ఓట్ల శాతంతో సుమన్ శెట్టి టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఆ తర్వాత భరణి 24.57 శాతం, ఫ్లోరా సైని 7.78 శాతం ఓట్లతో సెకండ్, థర్డ్ ప్లేస్ ల్లో ఉన్నారు. కామనర్స్ చూసుకుంటే ప్రియా శెట్టి ఈ వారం ఎలిమినేషన్ నుంచి బయట పడ్డట్లేనని టాక్. ఆమెకు 7.01 శాతం ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత డీమాన్ పవన్ 6.9 శాతం, హరిత హరీష్ 6.66 శాతం, మనీష్ మర్యాద 4.7 శాతంతో వరుసగా చివరి మూడు స్థానాల్లో ఉన్నారు.

Read Also: Black Eyed Peas: పిడికెడు గింజలు తింటే చాలు.. పుష్కలమైన లాభాలు..!

మర్యాదగా ఔట్

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ సెకండ్ వీక్ లో మర్యాద మనీష్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం దాదాపుగా ఖాయంగా కన్పిస్తోంది. ఈ వారం ఓటింగ్ లో అతనికే తక్కువ ఓట్లు వచ్చాయి. పైగా హౌస్ లోనూ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. అగ్ని పరీక్షలో తెలివిగా ఆడినా హౌస్ లో మాత్రం మనీష్ తేలిపోయాడు. పైగా తమ కామనర్స్ నే ఇష్టం వచ్చిన మాటలన్నాడు. ఈ నేపథ్యంలో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి మర్యాద మనీష్ తన ఓన్ హౌస్ కు వెళ్లిపోవడం ఫిక్స్ అని తెలిసింది. అంతేకాకుండా, నామినేషన్ ప్రక్రియలో మనీష్ డబుల్ స్టాండ్స్, ప్రతి చిన్న విషయానికి ఓవర్ థింకింగ్, ఓవర్ స్ట్రాటజీస్ వేయడమే అతడి కొంప ముంచినట్లు తెలుస్తోంది. నామినేషన్ ప్రక్రియకు ముందు కామనర్స్  వరస్ట్ అంటూ రెచ్చిపోయాడు. ముఖ్యంగా ప్రియా, శ్రీజ పై కోపంతో ఊగిపోయాయడు.  తీరా నామినేషన్ వచ్చేసరికి వారిలో నుంచి ఒక్కరిని కూడా నామినేట్ చేయకుండా.. ఎప్పుడో అయిపోయిన పాత గుడ్డు రీజన్ తో భరణిని నామినేట్ చేశాడు. ఇలా డబుల్ స్టాండ్స్ ప్లే చేయడం మనీష్ కి ప్రేక్షకుల్లో కాస్త నెగిటివిటీ తీసుకొచ్చిందని జనాల అభిప్రాయం.

Read Also: Axar Patel: పాక్ తో మ్యాచ్ ముందు భారత్ కు షాక్.. స్టార్ ప్లేయర్ జట్టుకు దూరం..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad