Sunday, November 16, 2025
HomeTop StoriesBigg Boss Ayesha: బిగ్ బాస్ నుంచి ఆమెను బయటకు పంపేశారుగా.. ఔటన్నట్లేనా?

Bigg Boss Ayesha: బిగ్ బాస్ నుంచి ఆమెను బయటకు పంపేశారుగా.. ఔటన్నట్లేనా?

Bigg Boss Ayesha: బిగ్‌బాస్ తెలుగు సీజన్-9లో షాకింగ్ ట్విస్ట్ ఎదురైంది. ఊహించని పరిణామం జరిగింది. వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్ అయేషా జీనత్‌ని హౌస్ నుంచి బయటికి వచ్చేసినట్లు తెలుస్తోంది. ఆరోగ్య సమస్యల కారణంగా బిగ్‌బాస్ హౌస్ నుంచి అయేషాని ట్రీట్‌మెంట్ కోసం బయటికి తీసుకొచ్చారంట. ఒకవేళ డాక్టర్స్ ఓకే చెప్తే మళ్లీ హౌస్‌లోకి అయేషాని పంపించే అవకాశం ఉంది. ఒకవేళ ఆమె కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుంది అంటే మాత్రం శనివారం ఎపిసోడ్‌లో అయేషాని వాలంటరీగా ఎలిమినేట్ చేసే అవకాశం ఉందని సమాచారం. అయేషాకు హెల్త్ బాలేదని ఈ విషయాన్ని ఆమె టీమ్ సోషల్ మీడియాలో తెలిపింది. “బిగ్‌బాస్‌లో ఆమె ప్రజెన్స్‌ని మేము చాలా మిస్ అవుతున్నాం. ముందు తను చాలా యాక్టివ్‌గా ఉండేది. కానీ డీహైడ్రేషన్ కారణంగా ప్రస్తుతం తను రెస్ట్ తీసుకుంటుంది. త్వరలోనే ఆమె పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాం.” అని అయేషా టీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

- Advertisement -

Read Also: Bigg Boss Written Updates: దొంగతనం తప్పు కాదు.. మాధురి మేడం తీర్పు..!

అరుపులు, కేకలతో…

ఇకపోతే, చూడటానికి క్యూట్‌గా కనిపించే అయేషా నోరు విప్పితే మాత్రం ఫైర్ బ్రాండ్ అనేలా అందరినీ మాటలతోనే కాల్చిపారేస్తుంది. ఆమె అడుగుపెట్టిన ఫస్ట్ వీక్‌లో తనూజని నామినేట్ చేస్తూ రిలేషన్స్ విషయంలో చెప్పిన పాయింట్స్ ఆడియన్స్‌కి బాగానే కనెక్ట్ అయ్యాయి. ఈ పిల్ల బానే మాట్లాడుతుందే అనుకున్నారు. కానీ ఈ వారం నామినేషన్స్‌లో రీతూ చౌదరిని నామినేట్ చేస్తూ అయేషా వ్యవహరించిన తీరు మాత్రం చాలా మందికి నచ్చలేదు. మరీ పర్సనల్ అటాక్ చేస్తూ ఏవే, పోవే, ఒసేయ్ అంటూ మరీ లోకల్‌గా మాట్లాడింది అయేషా. ఈ విషయంలో రీతూ-అయేషా మధ్య చాలా గొడవ కూడా జరిగింది. ఆ తర్వాత జరిగిన రెండు ఎపిసోడ్స్ లోనూ అయేషా ఎక్కడా కన్పించలేదు. దీంతో ఏమైందని ఆడియన్స్ కూడా డౌట్ వచ్చింది. అయితే, ఈ విషయంలో క్లారిటీ రావడంతో ఆడియన్స్‌కి అర్థమైంది. మరి ఆమె కోలుకుంటుందా లేక వాలంటరీ ఎలిమినేషన్ చేస్తారా అనేది చూడాలి.

Read Also: Bigg Boss Updates: మరోసారి మాధురిదే గెలుపు.. జేజేలు పట్టిన సంజన టీమ్

భారీ అంచనాలతో..

తమిళనాడుకి చెందిన అయేషా పలు సీరియల్స్, సినిమాల్లో నటించింది. తెలుగులో స్టార్ మాలో వచ్చిన ఊర్వశివో రాక్షసివో సీరియల్‌లో యాక్ట్ చేసింది. అలానే కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 1లో కూడా పార్టిసిపేట్ చేసింది. అంతేకాకుండా, తమిళ బిగ్‌బాస్‌లో కూడా కంటెస్టెంట్‌గా ఆడిన అనుభవం అయేషాకి ఉంది. ఫైర్ బ్రాండ్ గా అక్కడ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు భారీ అంచనాలతో తెలుగు బిగ్‌బాస్‌కి వచ్చింది. ఇప్పటివరకూ ఆట పరంగా పెద్దగా ఏం కనిపించకపోయినా అరుపులు, కేకలు, గొడవల్లో మాత్రం అయేషా ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగానే ఉంది. మరి అయేషాను ఉంచుతాడో ఊస్ట్ చేస్తాడో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad