Bigg Boss: బిగ్‌బాస్ ఫస్ట్ వీక్ నామినేషన్స్ ఈసారి చప్పగా సాగుతున్నయని అందరూ అనుకుంటున్నారు. కానీ, మూడోరోజు మాత్రం నామినేషన్స్ పోరు హైలెట్ గా మారింది. అవకాశం వచ్చింది కదా అని కామనర్లు చాలా తెలివిగా నామినేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మానిటర్ చెప్పిన మాట కూడా వినకుండా ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించిన సంజనని ఎక్కువ మంది టార్గెట్ చేశారు. అటు సెలబ్రెటీలు కూడా సంజననే ఎక్కువగా నామినేట్ చేశారు. అయితే ఈరోజు ఎపిసోడ్‌కి సంబంధించిన మొదటి ప్రోమోలో సుత్తి అందుకోవడానికి భరణి-ఇమ్మానుయేల్ పోటీపడగా భరణి గెలిచాడు.
Read Also: Bigg Boss: తొలివారం నామినేషన్స్‌లో 9 మంది.. సామాన్యుల నుంచి పడాల, భరణి సేఫ్..!
ప్లేట్ ఫిరాయించిన శ్రీజ
ఇక గెలిచిన తర్వాత తన వైపు నుంచి సంజనని నామినేట్ చేసి ఆ సుత్తి తీసుకెళ్లి దమ్ము శ్రీజ చేతికి ఇచ్చాడు. ఇక శ్రీజ ముందు సంజన గురించి చెప్పి తర్వాత తనూజని నామినేట్ చేసి ట్విస్ట్ ఇచ్చింది. సంజన గారు.. ఏవండి మీరు అలా షాంపు బాటిల్ బాత్రూంలో పెట్టడం ప్రాబ్లమ్ అండి.. మాకు వద్దు అన్నా కూడా.. లేదు నేను అట్లనే ఉంటా.. ఆ స్టాండ్ మీదే ఉంటా అన్నారు.. అది అసలు స్టాండ్‌యే కాదు.. అంటూ శ్రీజ ఫైర్ అయింది. తర్వాత తనూజని నామినేట్ చేస్తూ తన పాయింట్ చెప్పింది. తనూజ గారు ఫస్ట్ డే వచ్చిన దగ్గరి నుంచీ కూడా కామెంట్లు వేయడం మొదలుపెట్టారు అని ఆమెని టార్గెట్ చేసింది. అంతేకాకుండా.. ఈ కామెంట్లే ఇలాంటివి ఫస్ట్ డే నుంచి కూడా జరుగుతున్నాయి మీ దగ్గరి నుంచి.. అంటూ శ్రీజ చెప్పింది. దీనికి తనూజ ఏదో సమాధానం చెబుతుండగా మనుషుల్లా చూడట్లేదు అంటున్నారు.. అది వెరీ రాంగ్.. అని డీమోన్ పవన్ అన్నాడు. తనూజ వంట గురించి శ్రీజ పాయింట్ ఔట్ చేస్తూ.. ఎప్పుడు ఒక చిరాకు పడుతూ చేస్తున్నట్లు అనిపించింది అని చెప్పుకొచ్చింది.
Read Also: Bigg Boss: రీతూ తలకు గాయం.. లక్స్ పాప, బుజ్జిగాడు బ్యూటీ మధ్య గొడవ
ఫైర్ పైన తనూజ
ఒకరు వచ్చి ఒకసారి ఒకటి చెప్తారు.. ఇంకొకరు వచ్చి ఇంకోసారి ఇంకొకటి చెప్తారు.. మేమూ మనుషులమే.. అంటూ తనూజ కూడా రెయిజ్ అయింది. ఇంతలో అగ్నిపరీక్ష అనే ఫార్మాట్ నుంచి.. అంటూ హరీష్ లేచి మాట్లాడుతుంటే సార్ నేను అక్కడ మాట్లాడుతున్నాను.. అంటూ తనూజ ఆపింది. దీంతో బీపీ లేవడంతో హరీష్ రెచ్చిపోయాడు. నీ దయా దాక్షిణ్యాల మీద బతుకుతున్నామా ఏంటి.. మీ బాడీ లాంగ్వేజ్, మీ మాటే బాలేదు.. అని తనూజ గురించి అన్నాడు హరీష్. నా బాడీ లాంగ్వేజ్ గురించి నా మాట గురించి మాట్లాడే రైట్ మీకు లేదు.. అంటూ తనూజ కూడా గట్టిగానే రియాక్ట్ అయింది. ఇక హరీష్ ఈ మాట అనగానే నామినేషన్ దగ్గర ఉన్న భరణి.. మాస్క్‌మ్యాన్ వైపు దూసుకెళ్లబోయాడు. ఇంతలో ఇమ్మూ వచ్చి ఆపేశాడు. ఇక నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సుమన్ శెట్టికి తన బాధ చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది తనూజ. వాళ్లు నామినేషన్ చేసినందుకు నాకు హర్ట్ లేదు.. బిహేవియర్ బాలేదంటే.. ఒక ఆడపిల్ల బిహేవియర్ గురించి మాట్లాడితే ఒక మనిషి అది ఎట్లా పోట్రే అవుతుంది బయటికి.. అంటూ తనూజ ఏడ్చింది.


