Bigg Boss Voting: బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ఐదో వారం ఫుల్ ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని బిగ్ బాస్ అఫీషియల్ గా చెప్పినప్పట్నుంచి గేమ్ రసవత్తరంగా మారింది. కాగా.. మరో రెండ్రోజుల్లో ఐదోవారం ముగియనుంది. ఈ వారం నామినేషన్స్‌లో ఏకంగా పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే, ఈ వారం ఓటింగ్‌లో సత్తా చాటిన ఇద్దరు కంటెస్టెంట్స్ డేంజర్‌లో ఉన్నారు. ఆ నలుగురిలోనే ఈ వారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
పది మంది డేంజర్ జోన్ లో..
బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నామినేషన్స్‌లో సుమన్ శెట్టి, తనూజ గౌడ, భరణి, ఫ్లోరా సైని, రీతూ చౌదరి, డీమోన్ పవన్, శ్రీజ దమ్ము, కళ్యాణ్ పడాల, సంజన గల్రానీ, దివ్య నిఖితతో కలిపి మొత్తం పది మంది ఉన్నారు. అంటే, కెప్టెన్ రాము, ఇమ్యూనిటీ పొందిన ఇమ్మాన్యుయెల్ తప్పా మిగతా నామినేషన్స్‌కు వచ్చారు. వీరందరికి టాస్క్‌లు నిర్వహించి ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యే ప్రక్రియ మొదలు పెట్టాడు బిగ్ బాస్. అలా ఇప్పటివరకు కళ్యాణ్, భరణి, దివ్య మాత్రమే సేవ్ అయ్యారు. తాజాగా ఇవాళ్టీ ఎపిసోడ్‌లో తనూజ కూడా సేవ్ అయినట్లు సమాచారం. దాంతో మొత్తంగా పది మందిలో నలుగురు సేవ్ అయ్యారు.
Read Also: Bigg Boss Captaincy Task: పడాల పడిపోలేదు.. ఐదో వారం కెప్టెన్ గా కళ్యాణ్
నామినేషన్స్ లో ఆరుగురు
ఇక మిగతా కంటెస్టెంట్స్ అయిన రీతూ చౌదరి, ఫ్లోరా సైని, సుమన్ శెట్టి, డిమోన్ పవన్, శ్రీజ, సంజన ఆరుగురు ఎలిమినేషన్‌కు సంబంధించిన నామినేషన్‌లో ఉన్నారు. కానీ, పది మందికి నిర్వహించిన బిగ్ బాస్ ఓటింగ్ లెక్కలు మాత్రం మరోలా ఉన్నాయి. పది మంది బిగ్ బాస్ ఓటింగ్‌లో టాప్ 1లో 17.12 శాతం ఓట్లతో తనూజ, 15.38 శాతంతో కళ్యాణ్ రెండో ప్లేసులో, 12.96 శాతం ఓట్లతో సుమన్ శెట్టి మూడో స్థానంలో, 8.44 శాతం ఓట్లతో నాలుగో ప్లేసులో, ఫ్లోరా సైనీ 8.17 శాతం ఓట్లతో ఐదో స్థానంలో ఉన్నారు. అలాగే, 8.15 శాతం ఓట్లతో సంజన ఆరో ప్లేసులో, 8.13 శాతం ఓట్లతో టాప్ 7లో శ్రీజ, 7.66 శాతం ఓట్లతో నిఖితా టాప్ 8, కేవలం 7 శాతం ఓట్లతో టాప్ 9లో రీతూ, 6.99 శాతం ఓట్లతో డిమోన్ పవన్ పదో స్థానంలో ఓటింగ్‌ను బట్టి ఉన్నారు. అయితే, వీరిలో ఓట్ల దృష్ట్యా చివరిలో పవన్, రీతూ చౌదరి ఇద్దరు ఎలిమినేషన్‌కు దగ్గరిగా ఉన్నారు.
ఓటింగ్ ఎలా ఉందంటే?
అయితే, ఈసారి ఓటింగ్‌ను పక్కన పెట్టి ఇమ్యూనిటీ సాధించకుండా చివరి వరకు నామినేషన్స్‌లో ఎవరు ఉంటారో వారిని ఎలిమినేట్ చేయనున్నారని తెలుస్తోంది. చివరిగా నామినేషన్స్‌లో ఉన్నవారి ఓటింగ్‌ను బట్టి ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. అలా చూసుకుంటే ఓటింగ్ ఎక్కువ ఉన్న సుమన్, ఫ్లోరా సైనీ కూడా డేంజర్ జోన్‌లో ఉన్నట్లే. ఇలా ఓటింగ్ చివరిలో ఉన్న ఇద్దరు, ఇమ్యూనిటీ సాధించని ఇద్దరితో మొత్తంగా నలుగురు డేంజర్ జోన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ సుమన్ శెట్టి, రీతూ చౌదరి, డిమోన్ పవన్, ఫ్లోరా సైని ఈ నలుగురిలో ఛాన్స్ ఉందని సమాచారం. అయితే, సుమన్ శెట్టిని గెలికిన ఫ్లోరాకే ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.


