Sunday, November 16, 2025
Homeట్రేడింగ్Hero Viswaksen launches CMR Shopping mall: సీఎంఆర్ షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన హీరో...

Hero Viswaksen launches CMR Shopping mall: సీఎంఆర్ షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన హీరో విశ్వక్సేన్

విశ్వక్ సేన్ ను చూసేందుకు తరలివచ్చిన ఫ్యాన్స్..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థగా పేరుగాంచిన సీఎంఆర్ టెక్స్‌టైల్ అండ్ జ్యూయ‌ల‌ర్స్ ప్రైవేట్ లిమిటెడ్ త‌న 34వ‌ నూత‌న షాపింగ్ మాల్‌ను మేడ్చ‌ల్‌లో ప్రారంభించింది. సినీ హీరో విశ్వక్ సేన్ చేతుల మీదుగా మేడ్చ‌ల్ బ‌స్టాండ్ స‌మీపంలో మాల్ ప్రారంభోత్స‌వం జ‌రిగింది.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా సీఎంఆర్ ఫౌండర్ అండ్‌ చైర్మన్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ తమ సంస్థను గత నాలుగు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. త‌మ‌ 34వ షోరూమ్‌ను మేడ్చల్‌లో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎంఆర్‌లో షాపింగ్ అంటే ప్రపంచ స్థాయి అనుభూతి కలిగేలా ఉంటుందన్నారు.

సీఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ మావూరి మోహన్ బాలాజీ మాట్లాడుతూ తమ‌ 34వ షోరూమ్‌ను మేడ్చ‌ల్‌లో ప్రారంభించటం చాలా ఆనందంగా ఉందన్నారు. సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో ఫ్యామిలీ అందరికీ నచ్చే విధంగా అన్ని రకాల వెరైటీలు, డిజైన్స్ లభిస్తాయన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సినీ హీరో విశ్వక్సేన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయ‌న స్వయంగా మాల్‌లోని అన్ని సెక్షన్లు తిరిగి, అన్నిరకాల వస్త్రాలను పరిశీలించారు. తనకు అన్ని రకాల కలెక్షన్స్ బాగా నచ్చాయన్నారు. కాగా విశ్వక్ సేన్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad