Friday, November 22, 2024
Homeట్రేడింగ్Medicover free cancer detection: మెడికవర్ ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజ్

Medicover free cancer detection: మెడికవర్ ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజ్

ముందస్తు టెస్టులతో..

మహిళల్లో అండాశయ క్యాన్సర్ పై అవగాహన-ముందస్తు జాగ్రత్తల కొరకు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజిని అందిస్తున్నారు.

- Advertisement -

ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజి ని ప్రత్యేక అతిథులు దీప్తి అక్కి – స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్ కన్సల్టెంట్, సర్టిఫైడ్ ఫంక్షనల్ ట్రైనింగ్ అండ్ వెల్‌నెస్ కోచ్, మెంటల్ హెల్త్ అడ్వకేట్, ఫిట్‌నెస్ ఎంటర్‌ప్రెన్యూర్, లహరి విష్ణువఝల- టీవీ నటి-డాక్టర్ ప్రవీణ్ అడుసుమిల్లి- సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్-మహేష్ దెగ్లూర్కర్ మెడికవర్ హాస్పిటల్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ చేతుల మీదగా ఈ పోస్టర్ ఆవిష్కరించారు.

అనంతరం దీప్తి అక్కి మాట్లాడుతూ.. మారుతున్న జీవశైలి, ఒత్తిడి, ఇతరత్రా కారణాల వల్ల మహిళల్లో ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదురుకుంటున్నారు. మరి ముఖ్యంగా క్యాన్సర్. ముందస్తు పరీక్షలతో మనం కాన్సర్ ని గుర్తించవచ్చు మరియు సరైన చికిత్స అందించవచ్చు అని అన్నారు.
అనంతరం డాక్టర్ ప్రవీణ్ అడుసుమిల్లి మాట్లాడుతూ క్యాన్సర్ లు ప్రతి 87 మంది మహిళల్లో ఒక్కరు అండాశయ క్యాన్సర్ తో బాధపడుతున్నారు అన్నారు. ఈ తరహా క్యాన్సర్ లో లక్షణాలు త్వరగా బయటపడవు. ముందస్తు చెకప్ చేయించుకోవడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చు.

ఈ క్రింది లక్షణాలు

* 40 ఏళ్ళ పైబడిన వయస్సు వారు

• ఋతుక్రమములో మార్పులు

* వెన్ను నొప్పి

• కుటుంబ నేపథ్యంలో క్యాన్సర్ ఉన్న వారు

• పొత్తి కడుపులో నొప్పి మలబద్దకం

• కలయికలో నొప్పి

• కడుపు ఉబ్బరం లక్షణాలు ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలన్నారు.


అనంతరం మహేష్ దెగ్లూర్కర్ మాట్లాడుతూ మెడికవర్ కాన్సర్ ఇన్స్టిట్యూట్ నందు అత్యాధునిక సదుపాయాలు, పరికరాలు (హై ఎండ్ రోబోటిక్స్ మెషిన్స్, పెట్ సి.టి. స్కాన్స్), అనుభజ్ఞులైన డాక్టర్స్ 24/7 అందుబాటులో ఉంటారు.
క్యాంపు నందు అందించు పరీక్షలు – క్యాన్సర్ యాంటిజెన్ 125

• ఆల్ట్రాసౌండ్ (అబ్డోమెన్, పెల్విస్)

• కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సి బి పి)

  • • ఆర్ బి ఎస్ (షుగర్ టెస్ట్)
  • • క్యాన్సర్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్
    ఈ అవకాశం ఈ నెల 30 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు సద్వినియోగించుకోవాలని అన్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News