Sunday, November 16, 2025
Homeట్రేడింగ్Medicover free consultation on Brain Stroke: ప్రతి 40 సెకెండ్లకు ఒకరికి స్ట్రోక్

Medicover free consultation on Brain Stroke: ప్రతి 40 సెకెండ్లకు ఒకరికి స్ట్రోక్

బీపీ, షుగర్ కంట్రోల్ చేసుకోండి..

ప్రపంచవ్యాప్తంగా ప్రతి 40 సెకన్లకు ఒక్కరు స్ట్రోక్ బారినపడుతున్న నేపథ్యంలో ప్రపంచ స్ట్రోక్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ఉచిత న్యూరాలజిస్ట్ కన్సల్టేషన్ 30.10.2024 నుంచి 10.11.2024 అందిస్తున్నారు.

- Advertisement -

మంచి చికిత్సతో నార్మల్ జీవితం..

అప్పటి వరకూ ఆరోగ్యంగా ఉన్న వారిని వికలాంగుడిగా మార్చేస్తుంది ‘బ్రెయిన్ స్ట్రోక్’. కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా దారితీస్తుంది. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ వారిచే స్ట్రోక్‌కి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరికి అవగాహన కొరకు సమగ్ర స్ట్రోక్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌ను నిర్వహించారు. మన దేశంలోనే వార్షికంగా 1.66 మిలియన్ల కొత్త కేసులు వస్తూ, వాటిలో మరణాల సంఖ్య పెరుగుతోంది. 100,000 మంది జనాభాకు 86.5 మరణాలు సంభవిస్తున్నాయి.

స్ట్రోక్ మనదేశంలో మరణానికి నాల్గవ ప్రధాన కారణం, వైకల్యానికి ఐదవ ప్రధాన కారణం అని న్యూరాలజీ విభాగం వైద్యులు డాక్టర్ హరిరాధకృష్ణ, డాక్టర్ రంజిత్, డాక్టర్ విక్రమ్ కిషోర్ రెడ్డి, డాక్టర్ అభిషేక్ అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad