Sunday, December 8, 2024
Homeట్రేడింగ్RS brothers KG sales-crazy deals: ఆర్ఎస్ బ్రదర్స్ లో జోరుగా సాగుతున్న ఆషాఢం...

RS brothers KG sales-crazy deals: ఆర్ఎస్ బ్రదర్స్ లో జోరుగా సాగుతున్న ఆషాఢం కేజీ సేల్స్

ఆషాఢం వచ్చిందంటే కేజీ సేల్స్-క్రేజీ సేల్స్ తో ఏటా దూసుకుపోతోంది ఆర్ఎస్ బ్రదర్స్ వస్త్రాలయం. సూపర్ ఆఫర్స్ తో ఊరించే ఆర్ఎస్ బ్రదర్స్ అన్ని రకాల వస్త్రాలపై 70 శాతం తగ్గింపు ధరలతో వస్త్రాభిమానులను కట్టిపడేస్తోంది. సరసమైన ఆకట్టుకునే ధరలతో పాటు ఆఫర్లు కూడా ఆకట్టుకుంటున్నాయి.  త్వరలో రానున్న పండుగలు, శుభకార్యాల దృష్ట్యా పట్టు చీరలపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది.  ముఖ్యంగా కంచి పట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే ఇస్తోంది.

- Advertisement -

ఎన్ని వెరైటీలో..

ధర్మవరం, ఆరణి, ఉప్పాడ, పైఠాని, పోచంపల్లి, పటోలా, రాజ్ కోట్, జైపూర్, కోల్ కతా, బెనారస్ తో పాటు డిజైనర్, క్యాటలాగ్ చీరలపై, పురుషులు, పిల్లల వస్త్రాలపై కూడా ప్రత్యేక ఆఫర్ నిర్వహిస్తోంది ఆర్ఎస్ బ్రదర్స్. వినియోగదారుల రుచికి, అభిరుచికి, బడ్జెట్ కు తగ్గట్టు ఆర్ఎస్ బ్రదర్స్ కలెక్షన్ ఉంటుంది.

ఈఎంఐ కూడా..

హెచ్.డీ.ఎఫ్.సి డెబిట్ లేదా క్రెడిట్ కాకర్యులపై ఈఎంఐ లో కూడా ఈ ఆఫర్లు వర్తించేలా సేల్ నడుస్తుండటం ఆర్ఎస్ బ్రదర్స్ ప్రత్యేకతగా యాజమాన్యం వివరిస్తోంది.  గతంలో ఎన్నడూ లేనంతగా వస్త్రాభిమానులు, ఫ్యాషన్ ప్రియులు ఈసారి  ఆర్ఎస్ బ్రదర్స్ కు పోటెత్తుతుండటంపై ఆర్ఎస్ బ్రదర్స్ నిర్వాహకులు హర్షం వ్యక్తంచేశారు. వెస్ట్రన్ వేర్ తోపాటు ఎథ్నిక్ వేర్ కూడా అన్ని శ్రేణుల్లో ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. విశాలమైన షోరూంలు, పార్కింగ్ ప్లేస్, ట్రయల్ రూమ్స్, ఇతరత్రా అన్ని సదుపాయాలతో అన్ని వయసుల కస్టమర్లకు అనుకూలంగా ఉండేలా ఆర్ఎస్ బ్రదర్స్ షోరూములు ఉంటాయి. ఆషాఢంలో ప్రతి సంవత్సరం షాపింగ్ ప్రియులకు షాపింగ్ ఫెస్టివల్ అనుభూతి కలిగేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే ఆర్ఎస్ బ్రదర్స్ యాజమాన్యం అధునాతన డిజైన్లతో అన్ని వయసుల వారిని ఆకట్టుకునేలా స్టాక్ ను అందుబాటులో ఉంచుతోంది.

ప్రతి రోజూ కొత్త స్టాక్

ఆర్ఎస్ బ్రదర్స్ ప్రతి బ్రాంచ్ లోనూ ప్రతి రోజూ కొత్త స్టాక్ ను అందుబాటులోకి పెడుతుండటం మరో ప్రత్యేకత.  అందుకే అన్ని వయసుల వస్త్ర ప్రియులు తమ షోరూంకు విచ్చేసి, ఆఫర్ల ఆషాఢం సేల్ ను ఆస్వాదించాలని ఆర్ఎస్ బ్రదర్స్ యాజమాన్యం స్వాగతం పలుకుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News