Sunday, November 16, 2025
Homeబిజినెస్Airtel Plan: రూ.1 తో 14జీబీ డేటా..!

Airtel Plan: రూ.1 తో 14జీబీ డేటా..!

Airtel: ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్, డేటా మరియు అపరిమిత 5Gని అందిస్తోంది. ఇది రూ.399 తో రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్లాన్ ని పొందవచ్చు. ఇది పాత ప్లాన్ రూ.398 కంటే రూ.1 మాత్రమే ఎక్కువ. ఈ ప్లాన్ లో అదనంగా 14జీబీ డేటా పొందవచ్చు. ఈ ప్లాన్ జమ్ము కాశ్మీర్ మినహాయించి దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో అందుబాటులో ఉంటుంది.

- Advertisement -

ఈ కొత్త ప్లాన్ రూ.399తో రీఛార్జ్ చేయించుకుంటే 28 రోజుల వరకు అపరిమితంగా వాయిస్ కాలింగ్, హై స్పీడ్ 5జీ డేటా, ఉచిత నేషనల్ రోమింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ లో ప్రతి రోజు 2.5జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లను ఉచితంగా వినియోగదారులు పొందుతారు. అలాగే 28 రోజుల పాటు జియో హాట్ స్టార్ సభ్యత్వాన్ని ఉచితంగా పొందవచ్చు.

Readmore: https://teluguprabha.net/business/post-office-ppf-scheme-earn-43-lakhs-with-daily-411-rupees/

పాత ప్లాన్ రూ.398 రీఛార్జ్ చేయించుకుంటే, ఇందులో ప్రతిరోజూ 2జీబీ డేటా, అపరిమితంగా వాయిస్ కాలింగ్, హై స్పీడ్ 5జీ డేటా, ఉచిత నేషనల్ రోమింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో చూసుకుంటే.. దీనికి అదనంగా రూ.1 ఖర్చు చేయడం ద్వారా ప్రతిరోజూ 512ఎంబీ ఎక్కువ డేటాని పొందవచ్చు. ప్రస్తుతం ఈ ప్లాన్ ద్వారా ఎయిర్‌టెల్ ఇతర టెలికాం కంపెనీలకు సవాలు చేస్తుంది.

Readmore: https://teluguprabha.net/business/gold-and-silver-prices-updates-today-various-cities-in-india/

టెలికాం రెగ్యులారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా (టీఆర్ఏఐ) తాజా నివేదిక ప్రకారం, ఎయిర్‌టెల్ తన నెట్‌వర్క్‌ను గణనీయంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్ కంపెనీ సబ్‌స్క్రైబర్ బేస్ 36 కోట్లకు పైగా పెరిగింది. మరోవైపు వోడాఫోన్ ఐడియా (వీఐ), బీఎస్ఎన్ఎల్ కలిసి రెండు లక్షల కంటే ఎక్కువ మంది కస్టమర్లను కోల్పోయాయని నివేదిక చూపిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad