Gold Price Today: అంతర్జాతీయంగా, దేశీయంగా బంగారం, వెండి ధరలు అసాధారణ స్థాయిలో పెరుగుతున్నాయి. కేవలం ఆరు రోజుల్లోనే పసిడి ధర ఏకంగా రూ. 6,000 పెరిగింది. ఈ అనూహ్య పెరుగుదలకు ప్రధాన కారణం ఆర్థిక అనిశ్చితులు. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌తో పాటు ధరలు మరింత పెరుగుతాయనే వదంతుల కారణంగా ప్రజల నుంచి బంగారం, వెండికి డిమాండ్ అమాంతం పెరిగింది. పెట్టుబడిదారులు కూడా షేర్ మార్కెట్ నుంచి సురక్షితమైన బులియన్ మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్నారు.
Renault Rate Cuts: కార్లపై రూ.96వేల వరకు తగ్గింపులు ప్రకటించిన రెనాల్ట్ ఇండియా.. పూర్తి వివరాలివే..
బంగారం ధరల విశ్వరూపం
ప్రస్తుతం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,08,490కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,450 వద్ద ఉంది. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉన్నాయి.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై: ఈ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,08,490, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 99,450 గా ఉంది.
ఢిల్లీ: ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,08,620, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 99,600 గా ఉంది.
చెన్నై: చెన్నైలో అత్యధికంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,09,150, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,00,050 గా నమోదైంది.
వెండి ధరల పోకడలు
వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 1,28,000 నుంచి రూ. 1,38,000 వరకు ఉంది. ప్రాంతాలను బట్టి ధరల్లో వ్యత్యాసం కనిపిస్తుంది.
ఢిల్లీ, ముంబై: ఈ నగరాల్లో కిలో వెండి ధర రూ. 1,28,000 గా ఉంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై: ఈ నగరాల్లో కిలో వెండి ధర రూ. 1,38,000 గా ఉంది.
ఈ పెరుగుదల ధోరణి భవిష్యత్తులో కూడా కొనసాగే అవకాశం ఉంది, ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితి కొనసాగినంత కాలం. బంగారాన్ని ఎప్పటికీ సురక్షితమైన పెట్టుబడిగా భావించడం ప్రజల మనస్తత్వంలో ఒక భాగంగా మారింది.


