Tuesday, June 24, 2025
Homeబిజినెస్Jio New Recharge Plan: ఈ జియో ప్లాన్‌ రీఛార్జ్‌ చేసుకుంటే ఓటీటీలు, 50 జీబీ...

Jio New Recharge Plan: ఈ జియో ప్లాన్‌ రీఛార్జ్‌ చేసుకుంటే ఓటీటీలు, 50 జీబీ క్లౌడ్‌ స్టోరేజీ ఉచితం!

Jio New Plan Details: జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్‌ని రిలయన్స్‌ ప్రకటించింది. లాంగ్‌ టర్మ్‌లో రీఛార్జ్ చేసుకోవాలనే కస్టమర్లకు ఈ ఆఫర్‌ సరిపోతుంది. తాజాగా సరికొత్త వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ రూ. 3,599ని జియో ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు రోజూ 2.5 డేటా, అపరిమిత కాలింగ్‌తో పాటు అదనంగా ఓటీటీ (ఓవర్‌-ది-టాప్) ప్రయోజనాలను సైతం పొందవచ్చు. దీనికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో..

జియో రూ. 3,599 ప్లాన్ వివరాలు:
పూర్తి స్థాయిలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం జియో రూ. 3,599 ప్లాన్‌ని తీసుకువచ్చింది.

డేటా: రోజుకు 2.5 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. సంవత్సర కాలంలో మొత్తం 912.5 జీబీ డేటాను వినియోగదారులు పొందవచ్చు.

కాలింగ్ & SMS: అన్ని నెట్‌వర్క్స్‌కి అన్‌లిమిటెడ్‌ వాయిస్ కాలింగ్‌తో పాటు.. రోజుకు 100 SMSలను ఉచితంగా పొందవచ్చు.

OTT సబ్‌స్క్రిప్షన్లు:
జియో సినిమా ప్రీమియం: ఈ ప్లాన్‌లో 90 రోజులు (మొబైల్-మాత్రమే) జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ కింద అందిస్తుంది. 

జియో హాట్‌స్టార్: ఈ సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా మూవీస్‌, షోలు ఉచితంగా వీక్షించవచ్చు.

క్లౌడ్ స్టోరేజ్: డేటా బ్యాకప్, మేనేజ్‌మెంట్ కోసం 50 జీబీ జియో AIక్లౌడ్ స్టోరేజ్‌ని కస్టమర్లు పొందవచ్చు. జియో సినిమా మరియు జియో AIక్లౌడ్‌లోకి లాగిన్ అవ్వడానికి, రీఛార్జ్ కోసం ఉపయోగించిన నంబర్‌ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. 

ఈ వార్షిక ప్లాన్ ద్వారా నెలకు కేవలం రూ. 299 చొప్పున రీఛార్జ్‌ చేసుకున్నట్లు అవుతుంది. రెగ్యూలర్‌ రీఛార్జ్‌ రూ. 399గా ఉంది. అంటే నెలకు మీరు రూ. 100 చొప్పున ఆదా చేసుకోవచ్చు. ఇది ఏ ఇతర కాంపిటీటర్‌ ఆఫర్‌ చేయడం లేదని జియో తెలిపింది.

ఇతర ఆకర్షణీయమైన జియో ప్లాన్‌లు

రూ. 1,299 ప్లాన్: ఈ ప్లాన్‌ రీఛార్జ్‌ చేసుకోవడం ద్వారా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజుకు 2జీబీ డేటా, రోజు 100 SMSలను పొందవచ్చు. ఇది 84 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది.

రూ. 1,029 ప్లాన్: ఈ ప్లాన్‌లో అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. దీంతో పాటు అపరిమిత కాలింగ్, రోజుకు 2 జీబీ డేటా, డైలీ 100 SMSలు 84 రోజుల వ్యాలిడిటీ కలదు.

రూ. 1,799 ప్లాన్: ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు నెట్‌ఫ్లిక్స్ (బేసిక్‌) సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు. రోజుకు 3 జీబీ డేటాను అందిస్తుంది. దీని వ్యాలిడిటీ 84 రోజులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News