How To Choose Mutual funds: చాలా కాలం నుంచి ఈక్విటీ మార్కెట్లలో నేరుగా పెట్టుబడులు పెట్టడం కంటే మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అని చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కొందరు నేరుగా ఇన్వెస్ట్ చేసేందుకు ధైర్యం లేక వస్తుంటే మరికొందరు సమయం లేక వీటిని ఎంచుకుంటున్నారు. పైగా సెబీ రెగ్యులేషన్ కింద నిపుణులైన మేనేజర్లు వాటిని పర్యవేక్షించటం ఒక ప్లస్ పాయింట్. అయితే మ్యూచువల్ ఫండ్ ఎంచుకునేటప్పుడు కొత్త ఇన్వెస్టర్లు పరిశీలించాల్సిన ముఖ్య అంశాల గురించి స్కీమ్ ఎంచుకునే ముందు అవసరం. వాటి గురించి వివరంగా తెలుసుకుంటే, పెట్టుబడిలో మంచి నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ఈ క్రమంలో ఏఏ అంశాలు గమనించాలో ఇప్పుడు పరిశీలిద్దాం..
1. పెట్టుబడి లక్ష్యం:
-మొదట మీరు పెట్టుబడి లక్ష్యం ఏమిటనే విషయంలో స్పష్టత ఉండాలి. పిల్లల చదువు, పెన్షన్, ఇళ్లు, లేదా షార్ట్ టర్మ్ అవసరాల కోసం పెట్టుబడి చేయాలనుకుంటున్నారా అనే విషయంపై క్లారిటీ అవసరం. దీని ఆధారంగా సరైన ఫండ్ ఎంచుకోవటం కుదురుతుంది.
2. రిస్క్ ప్రొఫైల్ & పెట్టుబడి వ్యవధి:
-ఇక ఇన్వెస్టరుగా మీకు ఎంతవరకు రిస్క్ తీసుకునే అంశంలోనూ క్లారిటీ చాలా ముఖ్యం. తక్కువ రిస్క్ అయితే డెబ్ట్ లేదా లిక్విడ్ ఫండ్స్, ఎక్కువ రిస్క్ తీసుకోగలికితే.. ఈక్విటీ ఫండ్స్ ఎంచుకోవచ్చు. అలాగే స్వల్పకాల, మధ్యకాల, దీర్ఘకాల పెట్టుబడికి వేర్వేరు తరహా ఫండ్స్ అందుబాటులో ఉంటాయి.
3. గత పనితీరు:
-ఫండ్ గడచిన కొన్ని సంవత్సరాల్లో ఎలా పనిచేసిందో తెలుసుకోండి. కానీ కేవలం గత పనితీరు ఆధారంగా మాత్రమే ఫండ్ సెలక్షన్ తప్పుడు నిర్ణయాలకు దారితీస్తుంది. ఇది భవిష్యత్ రాబడులకు హామీ ఇవ్వగలదా లేదా గమనించేందుకు వ్యాపారాన్ని అర్థం చేసుకోవటం ఇతర ఫండ్స్ తో కంపేర్ చేయటం కూడా ముఖ్యం.
4. ఎక్స్పెన్స్ రేషియో:
-మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిని నిర్వహించేందుకు ఓ ఫీజు వసూలు చేస్తాయి. దానినే ఎక్స్పెన్స్ రేషియో అంటారు. తక్కువ ఖర్చు నిష్పత్తిగల ఫండ్స్ లాంగ్ టర్మ్ లో మంచి రాబడులు ఇస్తాయని గుర్తుంచుకోండి.
5. ఫండ్ మేనేజర్ అనుభవం:
-ఫండ్ మేనేజర్ అనుభవం, ట్రాక్ రికార్డు కూడా కీలకం. మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఫండ్ మేనేజర్ నిర్వహించే ఫండ్స్ కి అధిక ప్రాధాన్యత ఇవ్వండి.
6. అసెట్స్ అండర్ మేనేజ్మెంట్:
-ఫండ్ మొత్తం నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ కూడా చూడాలి. చాలా తక్కువ లేదా చాలా ఎక్కువ ఉన్న ఫండ్స్ అనుకోవడం కంటే, మోస్తరు AUM కలిగిన ఫండ్స్ సాధారణంగా గమనించటం కొత్త అవశాలను గుర్తించటంలో దోహదపడుతుంది.
7. రిస్క్ & రేటింగ్స్:
-ఫండ్ కు సంబంధించి స్టాండర్డ్ డివియేషన్, బీటా లాంటి మెట్రిక్స్ కూడా చూసుకోవచ్చు. అనేక రేటింగ్ ఏజెన్సీలు ఫండ్లకి రేటింగ్ ఇస్తుంటాయి.. వాటినీ కూడా పరిశీలించండి.
8. స్కీం డాక్యుమెంట్స్ చదవడం:
ప్రతి ఫండ్ స్కీమ్ ఇన్వెస్ట్మెంట్ లక్ష్యం, రిస్క్, ఫీజులు వంటి వివరాలు స్కీం ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ లో ఉంటాయి. దీనిని చదవడం ద్వారా అసలు మీరు సెలెక్ట్ చేసుకుంటున్న ఫండ్ గురించి చాలా విషయాలు పొందవచ్చు.
9. పోటీ ఫండ్స్‌తో పోలిక:
-ఎంచుకోబోయే ఫండ్స్ అదే కెటీగిరిలోని ఇతర ఫండ్లతో పనితీరులో పోల్చి చూడటం చాలా కీలకం అని గుర్తించండి.
మ్యూచువల్ ఫండ్ ఎంచుకునేటప్పుడు ఎప్పుడూ పైన అంశాలన్నిటినీ పరిశీలించాలి. ఒక్క పనితీరు లేదా పేరును చూసి, స్నేహితులు చెప్పారనో గుడ్డిగా ఫండ్స్ ఎంచుకోవటం తగదు. మీ పెట్టుబడి లక్ష్యం, రిస్క్ సహనాన్ని పాటు, ఖర్చులు, ఫండ్ మేనేజర్, రేటింగ్స్, ఇతర ఫండ్లతో పోలిక వంటి అంశాలను గమనించాలి. అప్పుడే మీ అవసరాలకు సరైన ఫండ్ ఎంచుకోవటంలో సక్సెస్ అవుతారు.


