Are You Laidoff: ప్రపంచ వ్యాప్తంగా ఏఐ ప్రభంజనం మెుదలైన తర్వాత అన్ని రంగాలు ప్రమాదంలో పడ్డాయి. ఎవరి జాబ్ ఎప్పుడు పోతుందో గ్యారెంటీ లేని రోజులివి. దీనికి తోడు ఆర్థిక వ్యాపార వాతావరణం కూడా కొంత ప్రతికూలంగా ఉండటంతో ఉద్యోగాల కోతలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఈ క్రమంలో అసలు తొలగింపులకు గురైన వ్యక్తులు సదరు కంపెనీల నుంచి పొందే పరిహారం గురించి వాటి పన్నులు, ఎలిజిబిలిటీ గురించి భారత చట్టాలు ఏమని చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తొలగింపు సమయంలో అందే సివరెన్స్ పే పన్ను పరిధిలోకి వస్తుంది. అందువల్ల ఉద్యోగులు తమ కంపెనీతో చేసుకున్న అగ్రిమెంట్లలోని నిబంధనల గురించి వాటి పన్ను ప్రభావాల గురించి తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండటం మంచిది. కంపెనీలు ఏదైనా కారణం వల్ల తమ ఉద్యోగులను రాజీనామా చేయమని కోరిన్నా లేక తొలగించినా, లేఆఫ్ చేసిన సమయంలో సివరెన్స్ పే అంటే పరిహారం అందిస్తుంటాయి. చట్టాల ప్రకారం ఈ సివరెన్స్ పేను శాలరీగా కాకుండా లాభాలుగా పరిగణించబడతాయి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 17(3) ప్రకారం. సాధారణ వేతనం మాదిరిగానే పన్ను లెక్కింపుల సమయంలో పరిహారంగా అందుకున్న డబ్బును కూడా ఆదాయంగా పరిగణించబడుతుంది.
ఇటీవల దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ లేఆఫ్స్ సమయంలో అనేక సంవత్సరాలుగా తమ వద్దపనిచేస్తున్న ఉద్యోగులకు మంచి పరిహారం ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా మంది ఉద్యోగులకు రూ.33 లక్షల నుంచి రూ.85 లక్షల వరకు 2022లో ఫోర్డ్ ఇండియా తమ ఉత్పత్తి ప్లాంట్ మూసివేత సమయంలో అందించింది. దీనికి ముందు యాక్సెంచర్ కూడా 2020లో ఉద్యోగుల తొలగింపులకు 7 నెలల వేతనం వరకు సివరెన్స్ పే రూపంలో అందించింది.
భారతదేశంలో సివరెన్స్ పే ను చట్టాలతో పాటు కంపెనీ పాలసీలు కూడా నిర్ణయిస్తాయి. ఉదాహరణకు ఎవరైనా వ్యక్తి కంపెనీలో పనిచేస్తూ నెల వేతనం కనీసం రూ.10వేలకు పైన ఉంటే అతను పనిచేసిన ప్రతి సంవత్సరానికి 15 రోజుల వేతనాన్ని సివరెన్స్ పే కోసం లెక్కించాల్సి ఉంటుంది. దీనిని ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కింద ఉన్న చట్టాల ప్రకారం కంపెనీలు లెక్కించాల్సి ఉంటుంది. అలాగే నాన్ వర్క్ మెన్ లేఆఫ్స్ విషయంలో కాంట్రాక్ట్ ప్రకారం తొలగించబడిన వారికి పరిహారం అందించాల్సి ఉంటుంది కంపెనీలు.


