LIC :వృద్ధాప్యం గురించి ఆందోళన చెందడం సహజం. అందుకే ప్రశాంతమైన పదవీ విరమణ జీవితం కోసం ముందుగానే ప్రణాళిక వేసుకోవడం చాలా ముఖ్యం. మీ తరువాతి సంవత్సరాల్లో ఎవరి సహాయం లేకుండా, మీ ఖర్చులను మీరే తీర్చుకునేలా నిధులను సృష్టించుకోవడం తెలివైన పని. పెట్టుబడిలో రిస్క్ ఉంటుందనే భయాన్ని వదిలివేయండి, ఎందుకంటే సరైన పాలసీలు మీకు భరోసా ఇస్తాయి.
భారతదేశంలో పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ భద్రత కల్పించే LIC (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పాలసీలకు మంచి డిమాండ్ ఉంది. వీటిలో “జీవన్ ఆనంద్ పాలసీ”కి విశేష ఆదరణ ఉంది. ఇది ఒక అద్భుతమైన టర్మ్ ప్లాన్.రోజుకు కేవలం ₹45 ఆదా చేయడం ద్వారా, మీరు మెచ్యూరిటీ సమయంలో ₹25 లక్షల వరకు భారీ నిధిని సృష్టించుకునే అవకాశం కల్పిస్తుంది ఈ పాలసీ.
పాలసీ వివరాలు , అర్హత
వయో పరిమితి: 18 సంవత్సరాలు నిండిన వారు ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. గరిష్టంగా 50 సంవత్సరాల వయస్సు వరకు మాత్రమే పాలసీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
కనీస బీమా మొత్తం: కనీసం ₹1 లక్ష బీమా మొత్తం అవసరం.
గరిష్ట బీమా మొత్తం: గరిష్ట పరిమితి లేదు. మీకు అవసరమైనంత బీమా మొత్తాన్ని ఎంచుకోవచ్చు.
మెచ్యూరిటీ కాలం: కొత్త జీవన్ ఆనంద్ పథకం కింద మెచ్యూరిటీ వ్యవధి 15 నుండి 35 సంవత్సరాల వరకు ఉంటుంది.
₹25 లక్షల నిధి ఎలా సాధ్యం?
మీరు ఈ పాలసీలో 35 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంటే, మెచ్యూరిటీ సమయంలో మీరు ₹25 లక్షలు పొందవచ్చు. దీనికోసం మీరు సంవత్సరానికి సుమారుగా ₹16,300 ప్రీమియం చెల్లించాలి.35 సంవత్సరాల పాటు మీరు చేసే మొత్తం డిపాజిట్ ₹5,70,500 అవుతుంది. మెచ్యూరిటీ తర్వాత, ఈ గ్యారెంటీ మొత్తానికి అదనంగా మీకు:
రివిజనరీ బోనస్: ₹8.60 లక్షలు
తుది బోనస్: ₹11.50 లక్షలు
ఈ రెండు బోనస్‌లు పాలసీ మొత్తానికి జోడై, మీకు మంచి రాబడిని అందిస్తాయి.
అదనపు ప్రయోజనాలు , పన్ను ఆదా
ఈ పాలసీ కేవలం రాబడిని మాత్రమే కాకుండా, అదనపు భద్రతను కూడా అందిస్తుంది
పన్ను ప్రయోజనం: ఈ పాలసీ మీకు సంవత్సరానికి ₹16,300 వరకు పన్ను ఆదా చేస్తుంది. అయితే, ఈ రాయితీని పాత పన్ను విధానం కింద మాత్రమే క్లెయిమ్ చేసుకోవచ్చు.
అదనపు రైడర్‌లు: యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటీ రైడర్, యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్, న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్, న్యూ క్రిటికల్ బెనిఫిట్ రైడర్ వంటి అదనపు ప్రయోజనాలను కూడా ఈ ప్లాన్ అందిస్తుంది.
మరణ ప్రయోజనం: ఒకవేళ పాలసీదారు మరణిస్తే, నామినీకి డెత్ బెనిఫిట్‌లో 125% లభిస్తుంది.
జీవన్ ఆనంద్ పాలసీ అనేది దీర్ఘకాలిక పెట్టుబడికి మరియు మీ కుటుంబ భవిష్యత్తుకు భద్రతకు ఒక గొప్ప ఎంపిక.


