Sunday, November 16, 2025
Homeకెరీర్CA Exams: భారత్‌-పాక్ ఉద్రిక్తతలు.. CA పరీక్షలు వాయిదా

CA Exams: భారత్‌-పాక్ ఉద్రిక్తతలు.. CA పరీక్షలు వాయిదా

దేశవ్యాప్తంగా సీఏ పరీక్షలు(CA Exams) వాయిదా పడ్డాయి. భారత్‌-పాక్‌ (India-Pakistan) ఉద్రిక్తతల నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేసినట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ప్రకటించింది. మే 9 నుంచి 14 వరకు జరగాల్సిన సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్, పోస్ట్‌ క్వాలిఫికేషన్‌ పరీక్షలు వాయిదా వేశామందిత. త్వరలోనే కొత్త పరీక్షల షెడ్యూల్‌ను వెల్లడిస్తామని పేర్కొంది. అభ్యర్థులు ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ICAI వెబ్‌సైట్ icai.orgలో చెక్ చేసుకోవాలని సూచించింది. కాగా గత షెడ్యూల్ ప్రకారం.. ICAI CA పరీక్షలు మే 2 నుంచి 14 వరకు జరగాల్సి ఉంది. గ్రూప్ 1 అభ్యర్థులకు CA ఇంటర్ పరీక్ష మే 3, 5, 7 తేదీలలో.. గ్రూప్ 2 పరీక్షలు మే 9, 11, 14 తేదీల్లో జరగాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad