Monday, June 16, 2025
Homeకెరీర్Narayana: నీట్-2025 ఫలితాల్లో నారాయణ విజయ పరంపర

Narayana: నీట్-2025 ఫలితాల్లో నారాయణ విజయ పరంపర

వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-2025 ఆల్ ఇండియా ఆల్ కేటగిరీలలో నారాయణ విద్యార్థులు విజయదుందుభి మోగించారు. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరిలో మృణాల్ కిషోర్ ఝా(హెచ్.టి.నెం : 2313103182) 4వ ర్యాంక్, కేశవ్ మిట్టల్ (హెచ్.టి.నెం : 250410409767) 7వ ర్యాంక్, సౌమ్య శర్మ (హెచ్.టి.నెం: 250410231562) 14వ ర్యాంక్, కె. జీవన్ సాయి కుమార్(హెచ్.టి.నెం: 250410773906) 18వ ర్యాంక్, రూపయన్ పాల్ (హెచ్.టి.నెం: 250410013768) 20వ ర్యాంక్ తో సంచలన విజయం అందుకున్నారు. వీటితో పాటు 35, 47, 49, 59, 66, 70, 71, 73, 75, 77, 80, 87, 93, 94, 95 వంటి 100 లోపు 22 ర్యాంకులు, 1000 లోపు 85 ర్యాంకులు నారాయణ విద్యార్థులు కైవసం చేసుకున్నారు.

అలాగే ఆలిండియా అన్ని కేటగిరీల్లో 1,2, 3, 3, 4, 4, 7, 10 వంటి 10 లోపు 8 ర్యాంకులు, 100 లోపు 65 ర్యాంకులు, 1000 లోపు 216 ర్యాంకులు సాధింపజేసి సరికొత్త రికార్డు నెలకొల్పి ఆలిండియా అగ్రగామిగా నిలిచిందని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్స్ డా.పి. సింధూర నారాయణ, పి. శరణి నారాయణ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డా. పి. సింధూర నారాయణ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంకు సాధించటం తెలుగు వారికి ఎంతో గర్వకారణమన్నారు. విశిష్టమైన ప్రణాళికలతో రూపొందించిన స్టార్ సిఓ బ్యాచ్, ఎన్-40 ప్రోగ్రామ్ ల ద్వారా మాత్రమే టాప్ ర్యాంకుల సాధన నిరంతరాయంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా చేసుకుని నిర్వహించబడుతున్న నీట్ పరీక్ష కోసం అత్యంత వినూత్న విద్యాప్రణాళిక వలనే ఈ టాప్ ర్యాంకులు సాధించగలిగామని తెలిపారు. సీబీఎస్ఈ బయాలజీ సబ్జెక్టులో తెలుగు విద్యార్థులు ఎటువంటి అసౌకర్యానికి లోనుకాకుండా ఫిజిక్స్, కెమిస్ట్రీలలో సీబీఎస్ఈ వారు తయారుచేసే ప్రశ్నాపత్రాలకు అనుగుణంగా అకాడమిక్ ప్రోగ్రామ్ తయారుచేసి కాన్సెప్ట్ బేస్డ్ విద్యావిధానాన్ని పరిగణనలోకి తీసుకోవటం వలనే అత్యధిక సంఖ్యలో టాప్ ర్యాంకులు సాధించగలిగామని చెప్పారు.

ఇక పి.శరణి నారాయణ మాట్లాడుతూ.. జాతీయస్థాయి నీట్ లో నారాయణ జైత్రయాత్ర నిర్విరామంగా కొనసాగుతోందని ఆనందం వ్యక్తం చేశారు. గత 16 సంవత్సరాలుగా పోటీ పరీక్షలన్నింటా విజయప్రస్థానాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మొట్టమొదటిసారిగా మూడు సార్లు ఎఐపీయంటీలో అలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించిన ఘనత ఒక్క నారాయణ విద్యాసంస్థదే అని గుర్తుచేశారు. ఇంతటి ఘనవిజయాలను సాధించడానికి కారణాలను విశ్లేషిస్తూ ప్రణాళికకు అనుగుణంగా రూపుదిద్దిన మైక్రోషెడ్యూల్స్, ఎక్స్ పర్ట్స్ చేత రూపొందించిన స్టడీ మెటీరియల్, అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన, రోజువారి టెస్ట్లు, వాటిపై సమగ్ర విశ్లేషణతో బలహీనతలను అధిగమిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకుపోయేలా ప్రతి విద్యార్థిని తయారు చేస్తున్నట్లు వివరించారు. ఇంతటి ఘనవిజయం సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక, అధ్యాపకేతర బృందానికి నారాయణ విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పునీత్ అభినందనలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News