Tollywood: ఈ ఏడాది సెప్టెంబర్ కి పెద్ద సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. వాటిలో ముఖ్యంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి కాగా, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 ఉన్నాయి. ఈ రెండు సినిమాలు దసరా పండుగ సందర్భంగా రిలీజ్ కాబోతున్నాయి. ఆల్రెడీ సెప్టెంబర్ 25న వచ్చేందుకు డేట్ ని కూడా లాక్ చేసుకున్నాయి. ఇక ప్రస్తుతం వీఎఫెక్స్ వర్క్ గనక పూర్తైతే మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభర కూడా ఇదే సెప్టెంబర్ కి రావొచ్చు. కానీ, అంతకన్నా ముందే 5 సినిమాలు ఒకే డేట్ కి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.
ఘాటి..
అనుష్క శెట్టి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్. వేదం తర్వాత క్రిష్ జాగర్ల మూడి, అనుష్క కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా. ఇందులో స్వీటీ గంజాయి సప్లై చేసే పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ తాజాగా వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ భారీ అంచనాలను పెంచేసింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న ఘాటి సక్సెస్ ముఖ్యంగా అనుష్కకి చాలా కీలకం. కాగా, ఈ సినిమాను సెప్టెంబర్ 5న రిలీజ్ చేయబోతున్నారు. ఇక అనుష్క, నవీన్ పోలిశెట్టి కలిసి నటించిన మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి అంచనాలను అందుకోలేకపోయింది.
Also Read – Rukmini Vasanth In Kantara: Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’లో రుక్మిణి వసంత్ లుక్.. కనకవతిగా రాజసం
హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకున్న కుర్ర హీరో తేజ సజ్జ ఇప్పుడు మరో మిరాకిల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమానే మిరాయ్. అనుష్క ఘాటి, తేజ సజ్జల మిరాయ్ సినిమాలు రెండు ఇప్పటికే పలుమార్లు రిలీజ్ వాయిదా పడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే మిరాయ్ చిత్ర నిర్మాత టిజి విశ్వప్రసాద్ విడుదల తేదీని కన్ఫర్మ్ చేయడంతో వాయిదా ప్రచారాలకు చెక్ పడిపోయింది. హనుమాన్ తర్వాత చేసిన మూవీ కావడంతో తేజ సజ్జ మార్కెట్ పెరుగుదల అనేది మిరాయ్ చిత్రం మీదే ఆధారపడి ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ కి అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఇందులో, మంచు మనోజ్ మాంత్రికుడుగా నటిస్తున్నాడు. సెప్టెంబర్ 5 న రిలీజ్ కాబోతుంది. ప్రేక్షకుల్లో అటు ఘాటి, ఇటు మిరాయ్ చిత్రాలపై మంచి బజ్ ఏర్పడింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల కుబేర సినిమాతో వచ్చి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా సక్సెస్ తర్వాత రష్మిక నుంచి వస్తోన్న మరో క్రేజీ మూవీ ది గర్ల్ ఫ్రెండ్. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అఫీషియల్ అనౌన్స్ త్వరలో రావ్వొచ్చని టాక్ వినిపిస్తోంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో రూపొందిన ఈ లవ్ థ్రిల్లర్ పూర్తిగా రష్మిక ఇమేజ్ మీదే మార్కెట్ అవుతోంది. సెప్టెంబర్ 5న ఈ సినిమా వస్తే పోటీ మాత్రం గట్టిగానే ఉంటుంది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ అదే డేట్ ని లాక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ గత సంవత్సరం అమరన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు మదరాసి అనే మరో డిఫరెంట్ జోనర్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ కు మ్యూజిక్ సెన్షేషన్ అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం మెయిన్ అట్రాక్షన్ గా నిలవబోతోంది. అలాగే, బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ నటిస్తున్న ‘భద్రకాళి’కూడా ఇదే సెప్టెంబర్ 5వ తేదీన తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీకి సురేష్ సంస్థ సపోర్ట్ ఉంది. ఇక ఈ మూవీ టీజర్ సినిమాపై బాగానే ఆసక్తిని కలిగించింది. మొత్తానికి ఇలా 5 సినిమాలు ఒకే రోజున బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతున్నాయి. మరి వీటిలో ఏ సినిమా హిట్ అవుతుందో ఏ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read – Mulugu Warangal Bridge Collapse : ములుగు–వరంగల్ రహదారిపై కూలిన వంతెన.. స్తంభించిన రాకపోకలు


