Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభAA22xA6: అల్లు అర్జున్, అట్లీ సినిమా చూడాలంటే 2027 వరకూ ఆగాల్సిందే.

AA22xA6: అల్లు అర్జున్, అట్లీ సినిమా చూడాలంటే 2027 వరకూ ఆగాల్సిందే.

AA22xA6: సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ఫ్రాంఛైజ్‌తో పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్ సాధించిన అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా మారాడు. ప్రభాస్, ఎన్‌టిర్, రామ్ చరణ్ లాంటి వాళ్ళు పాన్ ఇండియా క్రేజ్ వచ్చాక బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు ఫోకస్ చేశారు. కానీ, అల్లు అర్జున్ మాత్రం కోలీవుడ్ ఇండస్ట్రీ మీద ఫోకస్ చేశాడు. వాస్తవానికి బన్నీకి తెలుగు తర్వాత మలయాళం ఇండస్ట్రీలో భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. పుష్ప తర్వాత తమిళంతో పాటు కన్నడ భాషలలోనూ విపరీతంగా క్రేజ్ వచ్చింది.

- Advertisement -

తెలుగులో పాన్ ఇండియా హీరోలలో అల్లు అర్జున్‌కి వచ్చిన సపరేట్ క్రేజ్ అసాధారణం అని చెప్పాల్సిందే. ఇక అవార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బెస్ట్ యాక్టర్ గా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ని అలాగే ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ని దక్కించుకున్నారు. ఈ అవార్డ్స్ పుష్ప సినిమాలకి రావడం గొప్ప విషయం. ఈ సినిమాలలో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ మైండ్ బ్లాక్ రేంజ్‌లో ఉంటుంది. ముఖ్యంగా ఈ మూవీ కోసం ఆరునెలల పాటు చిత్తూరు యాస నేర్చుకోవడానికి సమయం కేటాయించి పర్ఫెక్ట్ అయ్యారు.

Also Read- Janhvi Kapoor: జాన్వీ క‌పూర్ మూవీకి షాకింగ్ క‌లెక్ష‌న్స్ – ఫ‌స్ట్ డేనే థియేట‌ర్లు మొత్తం ఖాళీ – ఇలా అయితే క‌ష్ట‌మే!

అయితే, అల్లు అర్జున్ పుష్ప ఫ్రాంఛైజ్ లో చేసిన రోల్ కి పూర్తి భిన్నంగా ఇప్పుడు చేస్తున్న తన 22వ సినిమాలో చేయబోతుండటం ఆశ్చర్యకరం. ఇది పక్కా సైన్స్ ఫిక్షన్ మూవీగా హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందుతోంది. ఇందులో బన్నీ ఎంతో స్టైలిష్‌గా కనిపించబోతున్నాడు. అట్లీకి ఇది కేవలం 6వ సినిమానే. కానీ, హాలీవుడ్ రేంజ్ లో స్క్రిప్ట్ ని రెడీ చేసి అల్లు అర్జున్ తో పాటు అగ్ర నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ కళానిధి మారన్ ని ఒప్పించడం అంటే ఎవరూ ఊహించనిది. ఇక్కడే సగం సక్సెస్ అయ్యాడు అట్లీ.

ఇక ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకొణె హీరోయిన్‌గా.. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న లాంటి హాట్ బ్యూటీస్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే, ఈ మూవీని చూడాలంటే రెండేళ్ళపాటు ఎదురుచూడాలంటున్నారు మేకర్స్. 2027 లో రిలీజ్ చేస్తారని సమాచారం. ఇంత ఆలస్యం అవడానికి కారణం ప్రధానంగా విఎఫ్ఎక్స్ వర్కేనని తెలుస్తోంది. వేలల్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ షాట్స్ ఉండటంతో ఎక్కువ సమయం పట్టేస్తుందట. అందుకే, అల్లు అర్జున్ 22వ సినిమా చూడాలంటే 2027 వరకూ ఆగాల్సిందే.

Also Read- Kaleshwaram report : కాళేశ్వరం కుదిపేస్తోంది: నివేదికపై సర్కారును నిలువరించాలంటూ హైకోర్టులో హరీశ్‌రావు హౌస్‌మోషన్‌!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad