Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభHero ram movies: 'ఆంధ్రా కింగ్ తాలూకా' రిలీజ్ ఆలస్యం: రామ్ ఫ్యాన్స్ నిరీక్షణ..!

Hero ram movies: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ రిలీజ్ ఆలస్యం: రామ్ ఫ్యాన్స్ నిరీక్షణ..!

Tollywod actor Ram new movie: టాలీవుడ్ నటుడు, చాక్లెట్ బాయ్ రామ్.. పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ గురించి అప్‌డేట్‌ లేకపోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. గత కొంత కాలంగా రామ్ కెరీర్లో వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఈ చిత్రం ఆయనకు చాలా కీలకంగా మారింది. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాకు మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో భాగ్య శ్రీ బోర్స్ కథానాయికగా నటిస్తున్నారు.

- Advertisement -

సినిమా విశేషాలు, అంచనాలు.

వివేక్ మెర్విన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన టీజర్ రామ్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో రామ్ మరియు భాగ్య శ్రీ మధ్య రొమాన్స్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ భాగ్య శ్రీ కెరీర్‌కు కూడా కీలకమైన బూస్ట్ ఇస్తుందని భావిస్తున్నారు.

విడుదల తేదీలో గందర గోళం:

వాస్తవానికి, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రాన్ని జూలై 14న విడుదల చేయాలని అనుకున్నారు, కానీ అది సాధ్యం కాలేదు. ప్రస్తుతం సినిమా విడుదల తేదీపై స్పష్టత కొరవడింది. ఒకపక్క ఆగస్టు 14 లేదా సెప్టెంబర్ మూడవ వారంలో విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నా, అధికారిక ప్రకటన వెలువడలేదు.

ప్రమోషన్స్ లేకపోవడం వల్ల నేనా..?:

రామ్ ఈ మధ్య ఫ్లాపులతో ఉన్న నేపథ్యంలో, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రం సరైన ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల ముందుకు రావడం చాలా ముఖ్యం. ప్రస్తుతం భారీ ప్రమోషన్స్ లేకుండా ఏ సినిమా కూడా విజయవంతం కావడం కష్టంగా మారింది. ముఖ్యంగా ఆగస్టులో సినిమా విడుదల కావాలంటే ప్రమోషన్ కార్యక్రమాలు ఈపాటికే మొదలుపెట్టాలి.

అభిమానుల అంచనాలను చేరుకోవడానికి రామ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారని తెలుస్తోంది. యువతను ఆకట్టుకునే సినిమాలతో రామ్ గతంలో ఎనర్జిటిక్ హిట్లు సాధించారు. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కూడా అదే తరహాలో రామ్ ఎనర్జీని ప్రదర్శిస్తూ ఫ్యాన్స్‌ ను ఖుషి చేస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. సినిమా అప్‌డేట్స్ త్వరలో వెలువడి, విడుదల తేదీపై స్పష్టత రావాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య రామ్ కు సరైన హిట్ అనేది లేదు. వరుసగా మాస్ సినిమాలు మాత్రమే ఎంచుకుంటున్న రామ్ పట్ల అభిమానులు కూడా మొహం చాటేస్తున్నారు అని టాక్ వినిపిస్తోంది. యంగ్ హీరోలంతా ప్రయోగాలు చేస్తూ ఉంటే రామ్ మాత్రం.. అదే మూస ధోరణి లో సినిమాలు తీస్తున్నారని.. వాటికి ఫుల్ స్టాప్ పెట్టీ కొత్త రకం సినిమాలతో రావాలని సోషల్ మీడియాలో అభిమానులు కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad