Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభNayanthara: అతని మీద ఇంప్రెస్ అయిందిగా

Nayanthara: అతని మీద ఇంప్రెస్ అయిందిగా

Nayanthara Telugu Movies: సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార ఇండస్ట్రీకొచ్చి ఇన్నేళ్ళైనా, కాస్త కూడా క్రేజ్ తగ్గలేదు. అంతేకాదు, సీనియారిటీతో పాటు భారీగా రెమ్యూనరేషన్ కూడా పెరుగుతోంది. ఇప్పుడున్న సీనియర్ హీరోయిన్స్‌లో నయన్ రేంజే వేరు. అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటోంది. బాలీవుడ్‌లోనూ నయన్ నటించిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. గత కొంతకాలంగా ఈ లేడీ సూపర్ స్టార్ కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటోంది.

- Advertisement -

ప్రస్తుతం, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తున్న మెగా 157 లో హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో నయన్ ఇంతకముందు చిరుతో సైరా మూవీలో ఆయనకి జంటగా నటించింది. గాడ్ ఫాదర్‌లో సోదరిగా కనిపించింది. ప్రభాస్ (Prabhas), వెంకటేశ్, నాగార్జున, ఎన్‌టిఆర్ లాంటి టాప్ స్టార్స్ అందరి సరసన నటించి సక్సెస్‌లు అందుకుంది. ఇక బాలకృష్ణతో (Balakrishna) నటించిన సినిమాలు నయన్ రేంజ్‌ని టాలీవుడ్‌లో ఇంకా పెంచాయి. వీరిది హిట్ పెయిర్ కూడా. ఇప్పుడున్న సీనియర్ హీరోలందరికీ నయన్ బెస్ట్ ఆప్షన్.

Also Read – Vishwambhara Songs: మెగాస్టార్‌తో బాలీవుడ్ బ్యూటీ స్టెప్పులు – గ్రాండియ‌ర్‌గా విశ్వంభ‌ర స్పెష‌ల్ సాంగ్ షూట్‌

అయితే, నయనతార ఒక సినిమా ఒప్పుకున్న తర్వాత కేవలం షూటింగ్ వరకే తప్ప.. ప్రమోషన్స్ కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరవరు. ఇది ఆమె పెట్టుకున్న కండీషన్. కానీ, మెగాస్టార్ కోసం దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కోసం ఆ కండీషన్ ని తీసి పక్కన పెట్టింది. ఈ కాంబోలో వస్తోన్న సినిమా మెగా 157 (Mega 157) కోసం డే 1 నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టింది నయన్. ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు చేసిన వీడియోతో సినిమాపై బాగా హైప్ పెంచేసింది. ఇక, ఈ సినిమా షెడ్యూల్స్ జెట్ స్పీడ్‌లో కంప్లీట్ అవుతున్నాయి.

మెగా 157 షూటింగ్ ని దర్శకుడు అనిల్ రావిపూడి కంప్లీట్ చేస్తున్న ప్లానింగ్ చూసి నయన్ షాకవుతోంది. ఇన్ని సినిమాలు చేసినప్పటికీ.. ఇంత పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో ఒక్క రోజు కూడా వేస్ట్ కాకుండా షూటింగ్ జరుపుతున్న విధానానికి నయనతార అనిల్ మీద చాలా ఇంప్రెస్ అయ్యారట. ఇటీవల కేరళలో ఈ మూవీలోని ఓ సాంగ్‌ను కంప్లీట్ చేశారు. మెగాస్టార్ కూడా అనిల్ వర్కింగ్ స్టైల్ నచ్చి వెంటనే మరో ప్రాజెక్ట్ చేద్దాం.. అంటూ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి అనిల్ రావిపూడి నయన్, మెగాస్టార్‌లను బాగా ఇంప్రెస్ చేశారు.

Also Read – HHVM Collections: ‘హరి హర వీరమల్లు’ ఫస్ట్ డే కలెక్షన్స్.. పవర్ చూపించిన పవన్ కళ్యాణ్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad