Ustaad Bhagat Singh Heroine: చబ్బీ బ్యూటీ రాశీ ఖన్నా (Raashi Khanna) హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి పుష్కర కాలం అవుతోంది. ఇప్పటికీ అవకాశాలను అందిపుచ్చుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తోంది. అయితే తెలుగులో ఆమె సినిమా రిలీజై మూడేళ్లవుతుంది. 2022లో విడుదలైన థాంక్యూ మూవీ తర్వాత ఆమె టాలీవుడ్‌లో సినిమా చేయలేదు. అయితే నీరజ కోన దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా రూపొందుతోన్న మూవీ ‘తెలుసు కదా’లో ఈ సొగసరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో శ్రీనిధి శెట్టి మరో హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాశీ ఖన్నాకు ఓ క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కింది. ఆ సినిమా ఏదో కాదు.. ఉస్తాద్ భగత్ సింగ్.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. తమిళ చిత్రం తెరకి ఇది రీమేక్. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఓ హీరోయిన్‌గా ఇప్పటికే శ్రీలీల ఫిక్సయ్యింది. ఆమెకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. మరో హీరోయిన్‌గా ఎవర్ని తీసుకుంటారనే దానిపై ఇన్నాళ్లు పాటు కొనసాగిన సస్పెన్స్‌కు తెరపడింది. రాశీ ఖన్నా ఉస్తాద్ భగత్ సింగ్‌లో కథానాయికగా కనిపించనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. పవన్‌కల్యాణ్‌తోపాటు, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.
Also Read – Naga Panchami 2025: ఈ ఏడాది నాగ పంచమి ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?
ఇది వరకే పవన్, హరీష్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ (Gabbar Singh) ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబోలో రానున్న ఉస్తాద్ భగత్ సింగ్‌పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
మరో వైపు ఈ ఏడాది పవన్ కళ్యాణ్ ఏకంగా రెండు సినిమాలతో సందడి చేయబోతున్నారు. అందులో ముందుగా జూలై 24న హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) రానుంది. పవర్‌స్టార్ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ఇది. పీరియాడిక్ టచ్‌తోసాగే యాక్షన్ థ్రిల్లర్. ఇందులో సనాతన ధర్మ పరిరక్షణకు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుని ఎదిరించే యోధుడి పాత్రలో పవన్ కనిపించబోతున్నారు. మరో వైపు OG మూవీ చిత్రీకరణను పూర్తి చేసుకుని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేసుకుంటోంది. ఈ మూవీని దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న (OG Release date) రిలీజ్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Also Read – Viral Video: వీధిలో వరద బీభత్సం.. కొట్టుకుపోతున్న వ్యక్తిని ఎలా కాపాడారంటే?


