Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభSaipallavi: ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న సాయి పల్లవి!

Saipallavi: ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న సాయి పల్లవి!

Saipallavi follows young tiger Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ జీవన తత్త్వం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. “ఈ క్షణం ఏంటి?” అన్నదే ఆయన ప్రధాన ఆలోచన. రేపు ఏం జరుగుతుంది? భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? వంటి ఆలోచనలకు తారక్ తన మనసులో చోటివ్వరు. “ఈ క్షణం మనం ఎలా ఉన్నాం అన్నదే ముఖ్యం” అని ఆయన నమ్ముతారు. జీవితం నీటి బుడగ లాంటిదని, మనిషి జీవితం ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియదని, ఎలా వచ్చామో అలాగే కనుమరుగైపోతామని ఆయన దృఢంగా విశ్వసిస్తారు. ఈ నిత్య సత్యాన్ని అంగీకరిస్తూనే తన ప్రయాణం సాగుతుందని ఎన్టీఆర్ తరచుగా చెబుతుంటారు.

- Advertisement -

ఎన్టీఆర్ బాటలో లేడీ పవర్ స్టార్: తాజాగా, నటి సాయి పల్లవి కూడా ఎన్టీఆర్ జీవన తత్వాన్ని అనుసరిస్తూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. “జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. అన్నీ అశాశ్వతమే. ఇప్పుడు ఎంత ప్రేమ ఉంది అన్నది ముఖ్యం. ఆ ప్రేమను ఇప్పుడు తీసుకున్నానా లేదా అన్నది ఆలోచిస్తాను. అది ఆ క్షణం మాత్రమే జరగాలి. తీసుకున్న ఆ క్షణాన్ని ఆస్వాదించాలి. అదే విధంగా గౌరవంగా ఉండాలి. ఈ ప్రేమ కూడా రేపు ఉండదు. అది తర్వాత రోజు మరోలా మారవచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు ఒక్కటే స్థిరంగా కనిపిస్తుంది. దానికి మాత్రమే స్థిరత్వం ఉంది. అంతకు మించి మరే అంశానికి స్థిరత్వం ఉండదు. అందుకే జీవితంలో ఏది వెంటనే జరిగినా దాన్ని తీసుకుని ముందుకు వెళ్లిపోవడమే. ఆ క్షణం ప్రేమను తీసుకోకపోయినా, బాధను తీసుకోకపోయినా కోల్పోయినట్లే. అందుకే వీలైనంత సానుకూలంగా ఉండటం అలవాటు చేసుకున్నాను” అని సాయి పల్లవి వెల్లడించారు.

రామాయణంలో సీతగా సాయి పల్లవి:

సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘రామాయణం’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె టాలీవుడ్‌కు దూరంగా ఉండటానికి గల కారణాన్ని ఈ సిద్ధాంతంలో వెతకవచ్చా అనే చర్చ విశ్లేషకులలో మొదలైంది. తెలుగులో అవకాశాలు వస్తున్నా ఆమె తిరస్కరిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బహుశా, తన ఈ జీవన తత్త్వానికి అనుగుణంగానే ఆమె కెరీర్ నిర్ణయాలు తీసుకుంటున్నారేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆమె తన ఎంపికల ద్వారా “వర్తమానంలో జీవించడం” అనే తత్వాన్ని ఆచరణలో చూపిస్తున్నారని చెప్పవచ్చు. రాబోయే రామాయణం సినిమాలో సీతగా సాయి పల్లవి ఎలా ఆకట్టుకుంటారు అనేది వేచి చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad