Sreeleela Dance Secret: ప్రస్తుతం శ్రీలీల ఇటు సౌత్ లో నార్త్ లో క్రేజీ హీరోయిన్. హిందీలో రెండు సినిమాలలో చేస్తున్న ఈ బ్యూటీ, తమిళంలో ఒక సినిమా తెలుగులో రెండు సినిమాలలో హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీలీల అంటే అందరికీ గుర్తొచ్చేది ఆమె డాన్స్. సినిమాలు ఫ్లాపవుతున్నా ఆమె డాన్స్ వల్లే వరుసగా అవకాశాలు అందుకుంటోంది. మహేష్ వంటి స్టార్ హీరో సైతం శ్రీలీల డాన్స్ గురించి స్పెషల్‌గా చెప్పాడంటే అమ్మడి పెర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల వచ్చిన జూనియర్ సినిమాలోను వైరల్ వయ్యారి సాంగ్ తో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు హైప్ రావటానికి ఈ పాటే ఎసెట్‌గా నిలిచిందనటంలో సందేహం లేదు.
మాస్ మహారాజ రవితేజ తో చేస్తున్న మాస్ జాతర (Mass Jathara) సినిమా వినాయక చవితి సందర్భంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే ఇండస్ట్రీలో ఈ మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా విడుదల వాయిదా వేసే మంచిదనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఆలోచన చేస్తున్నారట. రవితేజ, శ్రీలీల కలిసి ధమాకా సినిమాలో నటించి హిట్ అందుకున్నారు. మళ్ళీ, ఇదే కాంబినేషన్ మాస్ జాతర సినిమాతో రిపీటవడంతో హిట్ గ్యారెంటీ అని వైబ్స్ కనిపిస్తున్నాయి.
Also Read – OG Movie: ఓజీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ – ఈ సారి పవన్ గట్టిగా కొట్టాల్సిందే!
అయితే తాజాగా ఓ ప్రముఖ ఛానల్ లో సీనియర్ హీరో జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా కార్యక్రమానికి శ్రీలీల గెస్ట్ గా హాజరైంది. తనతో పాటు శ్రీలీల తల్లి స్వర్ణలత కూడా పాల్గొన్నారు. సరదసరదాగా సాగిన ఈ కార్యక్రమంలో జగపతిని కూడా కాసేపు ఆట పట్టించింది శ్రీలీల. ముఖ్యంగా శ్రీలీల డాన్స్ గురించే ఎక్కువగా ప్రస్తావించారు జగపతి. ఈ సందర్భంగా చాలా మంది ఆఫర్స్ ని లాగేసుకుంటున్నావని బయట టాక్ ఉంది అని కూడా చెప్పారు.
ఇదిలా ఉంటే శ్రీలీల ఇంతగా డాన్స్ చేయడానికి ఓ స్టార్ హీరో ఇన్స్పిరేషన్ అని శ్రీలీల తల్లి చెప్పరు. ఆమె జూనియర్ ఎన్టీఆర్ కూచిపూడి డాన్స్ నేర్చుకున్న విషయాన్ని చెబుతూ తారక్ చేసే డాన్స్ కి పెద్ద అభిమానులం అని చెప్పింది. ఆ ఇన్స్పిరేషన్ తోనే శ్రీలీలకి డాన్స్ నేర్పించానని చెప్పుకొచ్చింది. ఆయనను చూసే శ్రీలీల ఇన్సైర్ అయినట్టుగా వెల్లడించింది. ఇక తారక్ మంచి బీట్ ఉంటే ఏ రేంజ్ లో డాన్స్ ఇరగదీస్తాడో అందరికీ తెలిసిందే. ఇక ఈ షోలో శ్రీలీల చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read – Maa Inti Bangaram: సమంత సినిమా ఆగిపోలేదట – మా ఇంటి బంగారం నయా అప్‌డేట్ ఇదే!


