Janhvi Kapoor: దేవర మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి తనయ జాన్వీకపూర్. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 520 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. గత ఏడాది తెలుగు ఇండస్ట్రీలో హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న మూడో సినిమాగా నిలిచింది. హీరోయిన్‌గా జాన్వీకపూర్ ఏడేళ్ల కెరీర్‌లో అతి పెద్ద విజయంగా దేవర నిలిచింది. కానీ జాన్వీ యాక్టింగ్, స్క్రీన్ టైమ్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ డిసపాయింట్ అయ్యారు.
స్క్రీన్ టైమ్ తక్కువే…
చుట్టమల్లే సాంగ్‌తో పాటు కొన్ని సీన్స్‌కు మాత్రమే జాన్వీకపూర్ పాత్రను పరిమితం చేశారు డైరెక్టర్. జాన్వీ క్యారెక్టర్ లెంగ్త్ ఇంకాస్త ఉంటే బాగుండేదని కామెంట్స్ వినిపించాయి. ఈ విమర్శలతో సంబంధం లేకుండా సెకండ్ మూవీతోనే మెగా హీరో రామ్‌చరణ్‌తో జట్టు కట్టే ఛాన్స్ దక్కించుకున్నది. పెద్దిలో హీరోయిన్‌గా ఎంపికైంది జాన్వీకపూర్.
Also Read – War 2 OTT: ఎన్టీఆర్ వార్ 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్ కన్ఫామ్ – రెండు నెలల తర్వాతే స్ట్రీమింగ్!
పల్లెటూరి యువతిగా….
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న పెద్ది మూవీకి ఉప్పెన ఫేమ్ బచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. పెద్ది మూవీలో పల్లెటూరి యువతిగా జాన్వీకపూర్ కనిపించబోతున్నట్లు సమాచారం. రామ్‌చరణ్ పాత్ర ప్రధానంగా సాగే మూవీ అయినా ఇందులో జాన్వీకపూర్ రోల్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉండబోతున్నట్లు తెలిసింది. అంతే కాదు స్క్రీన్ టైమ్ విషయంలో దాదాపు రామ్‌చరణ్‌తో సమానంగా సినిమా మొత్తం జాన్వీకపూర్ పాత్ర కనిపిస్తుందని అంటున్నారు. పెద్ది.. నటిగా జాన్వీని కొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా అవుతుందని చెబుతోన్నారు. త్వరలోనే జాన్వీకపూర్ ఫస్ట్ లుక్‌తో పాటు క్యారెక్టర్ పేరును రివీల్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
లక్కీస్టార్…
బాలీవుడ్‌లో ఐరెన్‌లెగ్‌గా ముద్రపడిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో దేవర హిట్‌తో లక్కీస్టార్‌గా మారింది. పెద్దితో జాన్వీ కపూర్ లక్ కంటిన్యూ అవుతుందా? చరణ్‌కు కలిసొచ్చే హీరోయిన్‌గా నిలుస్తుందా? అన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
కలిసిరాలేదు…
అలియాభట్ మినహా రామ్‌చరణ్‌కు బాలీవుడ్ హీరోయిన్లు అంతగా కలిసి రాలేదు. కియారా అద్వానీతో వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాలు చేశాడు చరణ్. ఈ రెండు డిజాస్టర్స్‌గా నిలిచాయి. ప్రియాంక చోప్రాతో చేసిన బైలింగ్వల్ మూవీ తుఫాన్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అలియాభట్‌తో చేసిన ఆర్ఆర్ఆర్ ఒక్కటే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పెద్ది మూవీ విషయంలో బాలీవుడ్ హీరోయిన్ సెంటిమెంట్ మెగా ఫ్యాన్స్‌ను భయపెడుతోంది.
Also Read – Coolie Review: ‘కూలీ’ మూవీ హిట్టా.. ఫట్టా!
రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా…
దాదాపు మూడేళ్లు కష్టపడి బుచ్చిబాబు పెద్ది కథను సిద్ధం చేశాడు. సుకుమార్ గైడెన్స్ కూడా చాలానే ఉండటంతో కథ విషయంలో చరణ్ కాన్ఫిడెంట్‌గా కనిపించడం అభిమానులకు ఊరటనిచ్చే అంశంగా నిలుస్తోంది. పెద్ది మూవీ రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


